తెలంగాణ

telangana

ETV Bharat / state

పదో తరగతి విద్యార్థులకు అలర్ట్​ - ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచి మార్కులు పక్కా

SSC Exam Answering Tips in Telugu : చాలా మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు అనగానే భయానికి గురవుతుంటారు. బోర్డ్​ ఎగ్జామ్​ ఎలా రాయాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తెలియక తికమకపడుతుంటారు. అలాంటి వారికి విద్య నిపుణులు కొన్ని సూచనలు ఇచ్చారు. అవేంటో తెలుసుకోండి.

Exam Tips To Get Good Score In 10th Class
SSC Exam Answering Tips in Telugu

By ETV Bharat Telangana Team

Published : Mar 16, 2024, 12:41 PM IST

SSC Exam Answering Tips in Telugu :తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. మార్చి 18 నుంచి జరగబోయే ఈ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించడాని విద్యార్థులు ప్రిపేర్​ అవుతున్నారు. పరీక్షలంటే భయపడకుండా ఆత్వవిశ్వాసంతో రాస్తే మంచి మార్కులు సాధించవచ్చని విద్య నిపుణులు సూచిస్తున్నారు. పరీక్ష రాసేటప్పుడు విద్యార్థులు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మార్కులు తగ్గే ప్రమాదం ఉంటుందని, అలాంటివి జరగకుండా ఈ కింది జాగ్రత్తలు పాటిస్తే మంచి స్కోరు సాధించవచ్చని అంటున్నారు.

మ్యాథ్స్​ స్టూడెంట్స్​ కోసం సూపర్​ యాప్​ - స్కాన్​ చేస్తే చాలు - సమాధానం వచ్చేస్తుంది!

  • పరీక్షలు రాసేవారిలో ఎక్కవ మంది విద్యార్థులు ప్రశ్నపత్రం ఇచ్చిన ఐదు నిమిషాల్లోనే జవాబులు రాయడం స్టార్ట్​ చేస్తారు. అలా చేయకూడదు. ముందుగా ప్రశ్నల్ని పూర్తిగా చదవాలి. తర్వాత అడిగిన ప్రశ్నకు ఎన్ని మార్కులు? జవాబు ఎంత మేరకు రాయాలో ముందుగానే నిర్ణయించుకుని మొదలుపెట్టాలి.
  • ప్రశ్నపత్రంలో సరైన సమాధానం రాయగలమన్న నమ్మకం ఉన్న ప్రశ్నల నంబర్లను ముందుగా జవాబు పత్రంలో రాసుకోవాలి. వాటిలో ఏ ప్రశ్నకు సమాధానం సులభంగా రాయగలరో వాటిని మొదటగా రాయాలి. రాసిన ప్రతీ జవాబు నంబర్​ను ఎడమవైపు మార్జిన్​లో తప్పకుండా రాయాలి. ప్రశ్నల నంబర్లను తప్పుగా రాయడం, మరచిపోవడం వంటివి చేయకూడదు. అన్ని జవాబులు రాశాక మరోసారి జవాబులు వాటికి ప్రశ్న నంబర్లు రాశారో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.
  • ప్రశ్నపత్రంలో ఛాయిస్​ ఉన్నప్పుడు వాటి ఎంపిక సరిగ్గా ఉండేలా చూసుకోండి. కఠినంగా ఉన్న ప్రశ్నలను చూసి ఆందోళన చెందొద్దు. ముందుగా సులభంగా ఉన్న ప్రశ్నలకు సమాధానాలు రాసి తర్వాత కఠిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
  • పరీక్షలు రాసేటప్పుడు రెడ్​ ఇంక్​ పెన్నులు నిషేధం. నీలం (బ్లూ), నలుపు (బ్లాక్​) ఇంక్​ పెన్నులను మాత్రమే వాడాలి. సమాధాన పత్రాలతో కూడిన ప్రతి పేజీకి ఎడమ వైపు 2 లేదా 2.5 సెంటిమీటర్ల మార్జిన్​ను వదలితే జవాబు పత్రం చూడటానికి నీట్​గా ఉంటుంది.
  • ప్రశ్నల గురించి ఎక్కవ ఆలోచించకుండా, మార్కుల ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాసేలా జాగ్రత్తగా పడండి. పెద్దపెద్ద అక్షరాలతో మరీ ఎక్కవ మార్జిన్ వదిలేసి ఎక్కువ పేజీలు నింపాలని చూస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. సమాధాన పత్రాలు దిద్దేటప్పుడు ఉపాధ్యాయులు అసహనానికి గురయ్యే అవకాశముంటుంది.

టెట్‌ రాస్తున్నారా.. ఈ ట్రిక్స్ ఫాలో అయితే జాబ్ పక్కా మీదే..

Exam Tips To Get Good Score In 10th Class :

  • పేజీ చివర కొంత ప్రదేశం మిగిలందని మరో ప్రశ్న జవాబు రాయడం, పదాలు విడకొట్టి రాయడం లాంటివి చేయకూడదు. సాధ్యమైనంత వరకు జవాబులు వ్యాసంలా రాయకుండా పాయింట్ల వారిగా రాస్తే ప్రయోజనం ఉంటుంది. అలా రాయడం వల్ల పేపర్ దిద్దేవారికి చదవడానికి సులభంగా ఉంటుంది. సబ్​ హెడ్డింగ్​ పెట్టినప్పుడు దాన్ని అండర్​లైన్​ తప్పనిసరిగా చేయాలి. కోడ్​ పదాలను రాయకూడదు. పదాలు, వ్యాక్యాలు పూర్తిగా రాయండి.
  • ముఖ్యంగా చేతి రాత బాగుంటేనే పేపర్ దిద్దే ఉపాధ్యాయుడికి మీ పేపర్ పట్ల మంచి ఇంప్రెషన్​ ఏర్పడుతుంది. మీరు రాసే జవాబుల్ని మంచి భావనతో చదువుతారు.
  • బిట్​ పేపర్​లో కొట్టివేతలు, దిద్దివేతలు ఉండకుండా జాగ్రత్త పడండి. చివరి నిమిషం వరకు రాస్తూనే ఉండకూడదు. 10-15 నిమిషాల ముందే పరీక్ష రాయడం పూర్తి చేసి, జావాబు పత్రాన్ని మళ్లీ ఒకసారి చెక్​ చేసుకునేలా ప్లాన్​ చేసుకోండి.
  • తెలుగు, హిందీ, ఆంగ్లంలో వ్యాకరణం ముఖ్యమైంది. అక్షర దోషాలు లేకుండా రాయడంలో జాగ్రత్త పడండి. గ్రాఫ్​లు, డ్రాయింగ్స్​ కేవలం పెన్సిల్​తోనే వేయండి.

స్టడీ సర్కిళ్లలో డిజిటల్‌ శిక్షణ.. త్వరలో తరగతుల ప్రారంభం..

ABOUT THE AUTHOR

...view details