ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంజినీరింగ్‌ విద్యార్థి ఇన్నోవేషన్​- పోలీసు సేవలను సులభంగా వినియోగించుకునేలా వెబ్‌సైట్‌ - WEBSITE FOR POLICE SERVICES

అధునాతన సాంకేతికతతో వెబ్‌సైట్‌ రూపకల్పన -ఇంజినీరింగ్‌ విద్యార్థి నూతన ఆవిష్కరణ

srikakulam_engineering_student_innovated_website_for_police_services
srikakulam_engineering_student_innovated_website_for_police_services (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2025, 12:02 PM IST

Srikakulam Engineering Student Innovated Website For Police Services :ఇంజినీరింగ్‌ విద్యార్థులు అధునాత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు. వారు రూపొందిస్తున్న ప్రాజెక్టులు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. పోలీసు సేవలను అందరికీ చేరువ చేసి సులభంగా వినియోగించుకునేలా వెబ్‌సైట్‌ రూపొందించాలని ఎస్పీ ఇటీవల ఇంజినీరింగ్‌ విద్యార్థులను కోరారు. జిల్లాలోని పలు కళాశాలల విద్యార్థులు ప్రాజెక్టులు తయారు చేసి ఆయన కార్యాలయంలో ప్రదర్శించారు. ఎచ్చెర్లలోని శ్రీవెంకటేశ్వర ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థి తయారు చేసిన వెబ్‌సైట్‌ ఎంపికైంది. దీన్ని మరింత అభివృద్ధి చేయగా ఇటీవల ఎస్పీ ప్రారంభించారు.

కంచిలి మండలం కేసరిపడ గ్రామానికి చెందిన కొరికాన నవీన్‌ బీటెక్‌ చివరి సంవత్సరం (ఏఐఏఎల్‌ గ్రూపు) చదువుతున్నాడు. తండ్రి ఉమాపతి భవన నిర్మాణ కార్మికుడు. తల్లి హిమావతి గృహిణి. అతను రూపొందించిన శ్రీకాకుళం జిల్లా పోలీసు వెబ్‌సైట్‌ గతేడాది ఆగస్టులో ఎంపికైంది. అప్పటి నుంచి ఐదు నెలల పాటు వెబ్‌ డెవలప్‌మెంట్‌ టెక్నాలజీ ఉపయోగించి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశాడు. కళాశాలకు హాజరవుతూనే ప్రతి రోజు రాత్రి 8 నుంచి 12 గంటల వరకు పని చేసి కొలిక్కి తెచ్చాడు. ఈక్రమంలో 10, 15 రోజులకు ఓసారి ఎస్పీని కలిసి రూపకల్పనలో ఎదురవుతున్న సమస్యలు వివరించి సలహాలు తీసుకునేవాడు. నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ)తో సంప్రదించి https://srikakulampolice.ap.gov.in/ ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేసేలా కలెక్టర్, జిల్లా పోలీసు కార్యాలయాల అధికారులు సహకారం అందించారు.

Young Farmer Innovation : నీళ్లు లేకుండానే పంట.. యువరైతు వినూత్న ఆవిష్కరణ.. 20 ఏళ్లకు పేటెంట్​ హక్కులు కూడా..

ఉపయోగాలు ఇలా

  • జిల్లా పోలీసు కార్యాలయం, అన్ని పోలీసు స్టేషన్లలో పని చేస్తున్న అధికారుల పేర్లు, వారి ఫోన్‌ నంబర్లు, మెయిల్‌ ఐడీ వివరాలు తెలుసుకోవచ్చు.
  • మెయిల్‌/వాట్సాప్‌ ద్వారా చేసే ఫిర్యాదులు, ఎక్స్‌లో చేసే పోస్టులు పోలీసు అధికారులకు వెబ్‌సైట్‌లో కనిపిస్తాయి.
  • జిల్లా పోలీసులు ఎలా పని చేస్తారు? వివిధ దశల్లో ఫిర్యాదులు ఎలా వెళ్తాయి? వంటి వివరాలతో పట్టిక అందుబాటులో ఉంది. వాళ్లు సాధించిన విజయాలు, పురస్కారాల సమాచారం పొందుపరిచారు.
  • ఇప్పటివరకు పోలీసు శాఖలో పని చేసిన వారి వివరాలున్నాయి.
  • వెబ్‌సైట్‌ నుంచే ట్రాఫిక్‌ చలానా రుసుం చెల్లించవచ్చు.
  • చరవాణి చోరీకి గురైనా ఫిర్యాదు చేయవచ్చు.
  • పాస్‌పోర్టు తనిఖీకి సంబంధించిన సేవల వివరాలు ఉన్నాయి.
  • పోలీసు శాఖలో ఫిర్యాదులు, ఇతర అవసరాలకు వినియోగించే ఫారాలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
  • న్యాయశాఖ సెక్షన్లు, న్యాయ సేవలు, ట్రాఫిక్‌ చలానాలు, ఇతర వివరాలు ఉన్నాయి.
  • పోలీసులు చేసిన కార్యక్రమాల వీడియోలు, ఆడియోలు, పోస్టర్, ఫొటోలు అందుబాటులో ఉంచారు.

ట్రాఫిక్ సమస్యకు చెక్! - ఇంజినీరింగ్ విద్యార్థుల సరికొత్త ఆవిష్కరణ - Traffic Management System

ABOUT THE AUTHOR

...view details