ETV Bharat / state

హైటెన్షన్​ విద్యుత్​ తీగలు తగిలి టిప్పర్​ దగ్ధం - డ్రైవర్​ మృతి - MAN DIED DUE TO ELECTRIC SHOCK

అనంతపురం జిల్లాలో విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి - టిప్పర్‌ హైడ్రాలిక్‌ పైకి ఎత్తి గ్రీజు పట్టిస్తుండగా తగిలిన హైటెన్షన్‌ తీగలు

Man_Died_Due_to_Electric_Shock
Man_Died_Due_to_Electric_Shock (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2025, 3:57 PM IST

Updated : Jan 31, 2025, 6:11 PM IST

Man Died Due to Electric Shock: విద్యుత్ షాక్ తగిలి టిప్పర్ యజమాని మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం డి.హీరేహాళ్ మండలంలోని సోమలాపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఇనుప ఖనిజం లోడింగ్​కు వచ్చిన టిప్పర్ హై టెన్షన్ విద్యుత్ తీగలు తగలడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రాయదుర్గం మండలం కదరంపల్లి గ్రామానికి చెందిన సైఫుల్ల (30) మరణించాడు. ఉదయం తన టిప్పర్​కు గ్రీస్ పట్టడానికి టిప్పర్ హైడ్రాలిక్ పైకి ఎత్తాడు. దీంతో పైనున్న హై టెన్షన్ విద్యుత్ తీగల తగిలి మంటలు చెలరేగాయి.

విద్యుత్ షాక్​కు గురై తీవ్ర అస్వస్థత గురైన సైఫుల్లను కొంతమంది రాయదుర్గం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. సైఫుల్లకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సైఫుల్ల వ్యవసాయంతో పాటు టిప్పర్ నడిపేవాడు. సోమలాపురం రైల్వే స్టేషన్​లో వ్యాగిన్ నుంచి డి హీరేహాళ్​లో ఐరన్ ఓవర్ ఫ్యాక్టరీలకు టిప్పర్ల ద్వారా ముడిఖనిజం తరలిస్తారు. ఈ నేపథ్యంలో టిప్పర్ ఓనరు లోడింగ్​కు వచ్చాడు. లోడింగ్ ఆలస్యం కావడంతో రోడ్డు పక్కన టిప్పర్ హైడ్రాలిక్ గ్రీసింగ్ చేస్తుండగా విద్యుత్తు ప్రమాదం చోటు చేసుకుంది.

హైటెన్షన్​ విద్యుత్​ తీగలు తగిలి టిప్పర్​ దగ్ధం - డ్రైవర్​ మృతి (ETV Bharat)

విద్యుత్ ఘాతానికి టిప్పర్ పూర్తిగా కాలిపోయింది. టిప్పర్​తో పాటు యజమాని కూడా మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పొట్టకూటి కోసం వెళ్లి టిప్పర్ యజమాని మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సోమలాపురం రైల్వే స్టేషన్​లో విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

విశాఖలో దారుణం - ల్యాప్‌టాప్‌ కోసం కన్న తల్లినే కడతేర్చిన కుమారుడు

తణుకులో కలకలం - తుపాకీతో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య

Last Updated : Jan 31, 2025, 6:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.