ETV Bharat / state

'విచారణకు ప్రభావతి హాజరుకావాలి' - రఘురామ కేసులో సుప్రీంకోర్టు - RRR CUSTODIAL TORTURE CASE

రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో సుప్రీంకోర్టుకు డాక్టర్ ప్రభావతి - ముందస్తు బెయిల్ కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ పిటిషన్‌

RRR Custodial Torture Case
RRR Custodial Torture Case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2025, 3:54 PM IST

RRR Custodial Torture Case Doctor Prabhavathi Petition: రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సుప్రీంకోర్టును డాక్టర్ ప్రభావతి ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో ప్రభావతి పిటిషన్‌ వేశారు. డాక్టర్ ప్రభావతి పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ చేపట్టింది. తన వాదనలూ పరిగణనలోకి తీసుకోవాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కోర్టులో కేవియట్ దాఖలు చేశారు.

వీటిని పరిశీలించిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత 2 వారాల్లో రిజాయిండర్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది. విచారణకు డాక్టర్ ప్రభావతి హాజరుకావాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. తదుపరి ఉత్తర్వుల వరకు హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చిన ధర్మాసనం, 4 వారాలకు విచారణను వాయిదా వేసింది. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఏ5గా ప్రభావతి ఉన్నారు.

నన్ను కొట్టిన వ్యక్తిని గుర్తించా- రఘురామకృష్ణ రాజు

రఘురామ కేసులో జీజీహెచ్‌ మాజీ సూపరింటెండెంట్‌ పిటిషన్​ కొట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.