తెలంగాణ

telangana

ETV Bharat / state

8 ఏళ్ల వయస్సులో అద్భుతమైన ప్రతిభ - జాతీయ జెండాలను చూసి దేశం పేరు చెప్పేస్తాడు - Genius Child Yuvraj in Suryapet - GENIUS CHILD YUVRAJ IN SURYAPET

Special Kid in Suryapet : సాధారణంగా మూడో తరగతి చిన్నారులు బడికి పోమ్మంటేనే మారాం చేస్తుంటారు. ఇంకొందరు లెక్కలంటే విపరీతమైన భయం ఉంటుంది. ఐతే వారికి భిన్నంగా అద్భుత మేధాశక్తితో ఓ ఎనిమిదేళ్ల బాలుడు అబ్బుర పరుస్తున్నాడు. క్యూబ్‌ విలువలు, రోమన్‌ సంఖ్యలు గుక్క తిప్పుకోకుండా చెప్పడంతో సహా జాతీయ పతకాలను చూసి దేశాలు, వాటి రాజధానుల పేర్లు అవలీలగా చెబుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

Genius Child Yuvraj in Suryapet
Special Kid in Suryapet (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 15, 2024, 7:32 PM IST

8 ఏళ్ల వయస్సులో అద్భుతమైన ప్రతిభ జాతీయ జెండాలను చూసి దేశం పేరు చెప్పేస్తాడు (ETV Bharat)

Special Kid Yuvraj in Suryapet: పిట్టకొంచెం కూత ఘనం అనే మాట మనం తరచూ వింటుంటాం. ఇక్కడ పాఠశాలలో అందరితో కలిసి చదువుకుంటున్న చిన్నారి ఆ కోవలోకే చెందుతాడు. సూర్యాపేటకు చెందిన యమా ప్రమోద్‌, దీప్తిల చిన్న కుమారుడు యువరాజ్‌. మూడో తరగతి చదువుతున్న ఆ బాలుడు అపార జ్ఞాపక శక్తితో అందరిని అబ్బుర పరుస్తున్నాడు. పాఠశాల నిర్వహించిన కార్యక్రమంలో యువరాజ్‌ ప్రతిభను చూసి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎక్కాలు, సంఖ్యల ఘనపు విలువలు, దేశాల పేర్లు ఏదడిగినా బెరుకు లేకుండా సమాధానాలిచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు.

Super Talent Child in Telangana: ఏదైనా ఒకసారి చదివితే అలా గుర్తుంటుందని బాలుడు యువరాజ్‌ చెబుతున్నాడు. చదివేది మూడో తరగతే అయినా త్రికోణమితి వంటి పెద్ద తరగతుల లెక్కలు అవలీలగా చేయగలుగుతున్నాడు. జాతీయ పతాకం చూసి దేశం, దాని రాజధాని పేర్లు చెప్పడంతో పాటు, వాటి ఆకారాలు గీస్తానని చెబుతున్నాడు. యువరాజ్‌కి చిన్నప్పటి నుంచి మంచి జ్ఞాపక శక్తి ఉండేదని తల్లి దీప్తి చెబుతోంది. నర్సరీ స్థాయిలోనే ఆమె చెల్లెలి పుస్తకాలు చదివి గుర్తు పెట్టుకునే వాడని తెలిపింది. ఏ విధమైనా ప్రత్యేక శిక్షణ లేకుండానే స్వతహాగా పుస్తకాలు చదువుతూనే విషయ పరిజ్ఞానాన్ని పెంచుకుంటున్నాడని తెలిపింది.

ఎలాంటి యోగాసనాలైనా ఫుల్ ఈజీగా!- 'హర్షిక' సూపర్ టాలెంట్​- ఇంటి నిండా మెడల్సే!! - Child Expert In Yoga

Talented Kid Yuvraj do Maths Problems Easily : ఎక్కాలు, లెక్కలే కాకుండా ఆటల్లోనూ యువరాజ్‌ మంచి ప్రతిభ చూపుతాడని తండ్రి ప్రమోద్‌ చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే అన్నీ ఫుట్‌బాల్‌ లీగ్‌లు, క్రీడాకారులు, బహుళ జాతీయ కంపెనీల లోగోలు సైతం అవలీలగా చెప్పగలడని వివరించారు. గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్‌ అంతటి వాడిని కావడమే లక్ష్యమంటున్న యువరాజ్‌, అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు ధీటుగా ఎదుగుతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. నచ్చిన రంగంలో ఎదిగేందుకు పూర్తిగా సహకరిస్తామని తల్లిదండ్రులు వివరిస్తున్నారు.

"నర్సరీ ముందే మేము ఏబీసీడీలు నేర్పించకుండానే తాను నేర్చుకున్నాడు. మేం స్టోరీ బుక్స్​ తెప్పించుకునేవాళ్లం. అవి ఇంగ్లీషులో తప్పులు లేకుండా చదివేవాడు. సంఖ్యల క్యూబ్​ విలువలు కూడా బోర్డు మీద రాసేవాడు. అది వాళ్ల సార్​ చూసి, తనని చెక్​ చేశారు. కాలిక్యూలేటర్​ ఆన్​ చేసి పది అంకెల సంఖ్య టైప్​ చేసి, ఒక ఐదు నిమిషాల తరవాత చెప్పమంటే చెప్పాడు. మా అబ్బాయికి ఐక్యూ లెవల్​ ఎక్కువగా ఉందని చెప్పారు. " - దీప్తి , యువరాజ్‌ తల్లి

వ్యర్థాలతో కళాకృతులు రూపొందిస్తూ - ఔరా అనిపిస్తున్న బధిర విద్యార్థి - Def and Dem Student Talent

ABOUT THE AUTHOR

...view details