తెలంగాణ

telangana

ETV Bharat / state

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక - ఈ నెల 27న వారికి ప్రత్యేక క్యాజువల్​ లీవ్ - Casual leave on MLC Elections - CASUAL LEAVE ON MLC ELECTIONS

special casual leave : ఈ నెల 27న జరగబోయే ఉమ్మడి నల్గొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికకు ఓటు ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్​ లీవ్​ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్​ రాజ్​ స్పషం చేశారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.

Govt Employees Casual Leave For MLC Elections
special casual leave (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 24, 2024, 4:47 PM IST

Govt Employees Casual Leave For MLC Elections :ఈ నెల 27న జరగబోయే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గంలో ఓటు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ సెలవు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, సిద్ధిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సీఎల్ ఇవ్వాలని స్పష్టం చేశారు.

ప్రైవేట్ ఉద్యోగులకు సెలవు లేదు : ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రైవేట్ ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని చట్టంలో లేదని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు సీఈవో సూచించారు. ప్రైవేట్ కంపెనీలు, వ్యాపార సంస్థలు తమ సిబ్బంది ఓటు వేసేందుకు వీలుగా షిఫ్టుల సర్దుబాటు లేదా ఆలస్యంగా వచ్చేందుకు లేదా మధ్యలో వెళ్లి ఓటు వేసి వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కోరారు.

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసిన మరుక్షణమే ఆసక్తికర పోరు : తెలంగాణలో లోక్​సభ ఎన్నికల పోరు ముగియగా, ఈ నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, మరోవైపు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ విజయం సాధించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అదేవిధంగా ఈ ఎన్నికల్లోనూ బీజేపీ సైతం గట్టి పోటీ ఇస్తోంది. ఈ సమరంలో కలిసొచ్చేదెవరికో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Telangana Graduate MLC Elections 2024 : 2021లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పార్టీ తరఫున అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే గతేడాది డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో పట్టభద్రుల ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ పోరులో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి తీన్మార్‌ మల్లన్న, బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, గులాబీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఏనుగుల రాకేశ్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రచారానికి మరో 2 రోజులు మాత్రమే గడువు ఉండడంతో సన్నాహక భేటీలతో పట్టభద్రులను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు.

తారాస్థాయికి చేరిన నల్గొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఉపఎన్నిక ప్రచారం - GRADUATE MLC BY POLL CAMPAIGN

ఎమ్మెల్సీ ఉపఎన్నికలో అభ్యర్థుల ప్రచారజోరు - పట్టభద్రులు పట్టం కట్టేదెవరికి? - GRADUATE MLC BY POLL CAMPAIGN

ABOUT THE AUTHOR

...view details