Special Trains on the Occasion Of Sankranti : సంక్రాంతి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడపనుంది. పలు స్టేషన్ల మధ్య మొత్తం 26 ప్రత్యేక రైళ్లను అదనంగా నడపాలని నిర్ణయించింది. ఈ రైళ్లు జనవరి 10 నుంచి 17 వరకు సర్వీసులందించనున్నాయి. విశాఖపట్నం - చర్లపల్లి మధ్య పలు జన సాధారణ్ రైళ్లను నడపనున్నారు.
ఈ అన్‌రిజర్వ్‌డ్ స్పెషల్ రైళ్లు చర్లపల్లి-విశాఖపట్నం స్టేషన్ల మధ్య జనవరి 10 నుంచి 17 మధ్య తేదీల్లో మొత్తం 16 జన సాధారణ్ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. సికింద్రాబాద్- అర్సికెరే (కర్ణాటక), బెంగళూరు - కలబుర్గి స్టేషన్ల మధ్య మరికొన్ని సర్వీసులు ఏర్పాటు చేశారు. ఈ జనసాధారణ్ ప్రత్యేక రైళ్లన్నీ జనరల్ కోచ్‌ల్లో ప్రయాణించే ప్రయాణికులకు సులభతరం చేయడానికి అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లను కలిగి ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ అదనపు ప్రత్యేక రైళ్లు సర్వీసులందించే తేదీలు, రూట్ల వివరాలు ఇలా ఉన్నాయి.