తెలంగాణ

telangana

ETV Bharat / state

చిచ్చు పెట్టిన ఆస్తి : తల్లి, సోదరుడిని కత్తితో నరికి, చాకుతో పీకలు కోసి హత్య - SON KILLED MOTHER AND BROTHER

ఆస్తి కోసం సవతి తల్లి, సోదరుడి హత్య - తల్లిని వెంటపడి మరీ చంపిన కుమారుడు - ఏపీలో దారుణ ఘటన

Son Killed Stepmother and Younger Brother for Property
Son Killed Stepmother and Younger Brother for Property (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 25, 2024, 12:38 PM IST

Son Killed Stepmother and Younger Brother for Property :ఉమ్మడి ఆస్తి 41 సెంట్ల పొలం, 192 గజాల ఇంటి స్థలం అన్నదమ్ముల మధ్య పంచాయితీ తీసుకొచ్చింది. తాత ద్వారా వచ్చిన ఆస్తిని ఎలాగైన తకనే దక్కాలనుకున్న అన్న కక్షగట్టి తండ్రి రెండో భార్యను, ఆమె కుమారుడిని పాశవికంగా హత్య చేశాడు. కత్తితో నరిగి, చాకుతో పీకలు కోసి నిశిరాత్రిలో బీభత్సం సృష్టించాడు. ఈ నెల 23 అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘటన ఏపీలోని మండవల్లి మండలంలో సంచలనం రేపింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఏలూరు జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీ శ్రావణ్‌ కుమార్‌ ఆదివారం రాత్రి వివరాలు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌ గన్నవరానికి చెందిన రొయ్యూరు సుబ్బారావుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య నాంచారమ్మకు నగేశ్‌ బాబు కుమారుడు ఉన్నాడు. ఆమె అనారోగ్య కారణంగా మృతి చెందారు. నాంచారమ్మ చెల్లెలు భ్రమరాంబను రెండో పెళ్లి చేసుకున్నాడు. వారికి సురేశ్‌ అనే కుమారుడు ఉన్నారు. అయితే వారు కలిసి ఉంటున్న 192 గజాల ఇంటి స్థలం విషయమై అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆస్తంతా తనకే కావాలని, ఇవ్వకపోతే చంపేస్తానని నగేశ్‌ బాబు తరచూ ఆమెని బెదిరించేవాడు. పెద్దలతో పంచాయితీ పెట్టినా వివాదం కొలిక్కిరాలేదు.

పరామర్శించడానికి వచ్చిన బామ్మర్దితో బావ వాగ్వాదం - పరస్పర దాడిలో ఇద్దరు మృతి

పీక కోసి హత్య చేసి : సురేశ్ మామ సంవత్సరీకం కావడంతో ఈ నెల 21న భార్య, పిల్లలు ముసునూరుకి పంపించారు. రోజు మాదిరి ఆ రాత్రి కూడా తల్లీకుమారుడు పనులు చేసుకుంటూ ఉన్నారు. 23న పనులు ముగించుకుని రాత్రి తల్లీకుమారుడు నిద్రించారు. అర్ధరాత్రి దాటాక ఇంట్లోకి చొరబడిన నగేశ్‌ బాబు కత్తి, చాకుతో తల్లీకొడుకుపై విచక్షణారహితంగా దాడి చేశాడు. మంచంపై నిద్రించిన సురేశ్‌ పీక కోసి చంపాడు. దీన్నీ చూసి భయపడి పారిపోతున్న భ్రమరాంబను వెనుక నుంచి కత్తితో నరికి పీక కోసి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 48 గంటల్లోపు నిందితుడిని అరెస్టు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నగేశ్‌ బాబును ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు స్వాధీన పరుచుకున్నారు. కేసును చేధించిన కైకలూరు గ్రామీణ సీఐ వీరా రవికుమార్‌, మండవల్లి ఎస్సై రామచంద్రరావు, కానిస్టేబుళ్లు నాగార్జున, నాగాంజనేయులు, నాగబాబులను డీఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులు అందజేశారు.

ఇన్‌స్టాలో పరిచయం, ఫ్రెండ్​ రూమ్​లో వివాహం - ఆ తరువాత!

కన్న కూతురు ఛాతి చీల్చిన తల్లి - అడవిలోకి తీసుకెళ్లి ఏడాదిన్నర బాలిక నరబలి!

ABOUT THE AUTHOR

...view details