This Habits Causes Heart Disease in Men :పలు విషయాల్లో ఆడవాళ్లు బేలగా మారి, ఏదైనా ఉంటే పైకి చెప్పుకుని బాధపడతారు. దాంతో ఆ విచారం నుంచి ఉపశమనం కూడా పొందుతారు. పురుషులు అలా కాదు. గుంభనంగా ఉంటారు. ఏ విషయాన్నీ పైకి డైరెక్ట్‌గా చెప్పరు. నోరు తెరిచి హెల్ప్ అడగలేరు. ఇలా చేస్తే ఎక్కడ తమను నలుగురూ చిన్నచూపు చూస్తారోననే భయం. ఇదిగో ఈ అలవాటే మగవాళ్లలో ముఖ్యంగా గుండెజబ్బులు పెరగడానికి కారణం అంటోంది యూనివర్సిటీ ఆఫ్ షికాగో శాస్త్రవేత్తలు చేసిన ఓ అధ్యయనం.
చిన్న అనారోగ్యమేగా? అన్న నిర్లక్ష్యపు ధోరణి.. ‘ఇది మనల్ని ఏం చేస్తుందిలే అనే ధీమా వాళ్లని సకాలంలో ట్రీట్మెంట్ తీసుకోనివ్వకుండా చేస్తున్నాయట. ఒక వేళ వాళ్లకి నిజంగా ఏదైనా సమస్య ఉందని తెలిసినా, దాని గురించి చర్చించడానికీ పెద్దగా ఇష్టపడరట. 24 సంవత్సరాల కాలంలో సుమారు 1400 మందిపైన చేసిన రీసెర్చ్‌లో ఈ వాస్తవాలు వెల్లడయ్యాయి. అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఎవరేమనుకుంటారో అనే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం చాలా కీలకం అంటున్నారు అధ్యయనవేత్తలు.
ఈ అలవాటుతోనూ మగవాళ్లలో గుండెజబ్బులు
మగవారిలో గుండె జబ్బులు పెరుగుతున్న సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆధునిక జీవనశైలిలోని కొన్ని అలవాట్లు. ఈ అలవాట్లను మార్చుకోవడం ద్వారా గుండె జబ్బులను నివారించుకోవచ్చు.
ధూమపానం : సిగరెట్, బీడీ వంటివి తాగడం గుండెకు పెద్ద శత్రువు. ఇది రక్తనాళాలను కుంచించుకుపోయేలా చేసి, గుండెపోటుకు ప్రధాన కారణం.
అధిక ఆల్కహాల్ సేవనం :అధికంగా మద్యం తాగడం కూడా గుండెకు హాని కలిగిస్తుంది. ఇది రక్తపోటును పెంచి, గుండె కండరాలను దెబ్బతీస్తుంది.
అనారోగ్యకరమైన ఆహారం :ఎక్కువగా జంక్ ఫుడ్, కొవ్వు ఆహారాలు, తీపి పదార్థాలు తీసుకోవడం కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి, గుండె జబ్బులకు దారితీస్తుంది.