Social Media Effect on SPDCL in Telangana: విద్యుత్ సరఫరా చేసే ఎస్పీడీసీఎల్పై కొందరు నకిలీ సోషల్ మీడియాలో అకౌంట్లు రూపొందించి తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు యాజమాన్యం గుర్తించింది. కొంతమంది అదే పనిగా సంస్థపై దుష్ప్రచారానికి తెగబడుతున్నారని అధికారులు నిర్ధరించారు. పబ్లిసిటీ ఫుల్ - ఎలక్ట్రిసిటీ నిల్, కరెంట్ లేక లిఫ్ట్ ఔట్ ఆఫ్ ఆర్డర్, ఎల్లుండి రాష్ట్రమే ఔట్ ఆఫ్ ఆర్డర్ వంటి హెడ్డింగ్‌లతో పోకిరీలు ఎస్పీడీసీఎల్ సంస్థను చులకన చేస్తున్నారని అధికారులు తెలిపారు. అలాంటి వాటిని కట్టడి చేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. పోకిరీల చేష్టలను గుర్తించేందుకు ప్రత్యేకంగా ఇద్దరు సిబ్బందిని నియమించిన యాజమాన్యం, సామాజిక మాధ్యమం వేదికగా వచ్చిన వాటికి తక్షణమే సమాధానమిస్తున్నారు.
'విద్యుత్ వినియోగం పెరుగుతోంది.. అయినా ఇబ్బందులు రానీయం'
Telangana SPDCL React on Fake News in Social Media: కరెంట్‌పోయినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదంటూ సోషల్ మీడియాలో పోస్టు చేయగానే వెంటనే అప్రమత్తం అవుతున్న సిబ్బంది చిరునామాతో పాటు మరికొన్ని వివరాలు చెప్పండి అని ప్రశ్నించగానే సదరు పోకిరీలు ఆ పోస్టులను డిలీట్(Fake Posts on TSSPDCL) చేస్తున్నారని యాజమాన్యం తెలిపింది. వినియోగదారుల కోసం వెచ్చించాల్సిన సమయాన్ని పోకిరీలు వృథా చేస్తున్నారని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినీ హీరోల ఫొటోలు, నకిలీ ఐపీలు, విచిత్రమైన పేర్లతో సంస్థ, అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని యాజమాన్యం వెల్లడించింది.