Side Effects of Kajal on Eyes in Telugu : కాటుక ఆడవారి సౌందర్య సాధనాల్లో ఒకటి. అమ్మాయిలూ, స్త్రీలూ వారి కళ్లకు కాటుక పెట్టుకోనిదే మేకప్ పూర్తి కాదని భావిస్తారు. ఎంత ముస్తాబైన చివరగా కంటికి కాటుక లేకపోతే అందంగా లేమని చాలా మంది వనితలు అనుకుంటారు. అందుకే కంటికి పెట్టే కాటుక తెచ్చే అందమే వేరయా అంటారు. చక్కనైన డ్రెస్, శారీ కట్టుకున్న కంటికి కాటుక పెడితేనే ఆ అందం. అందుకే ఆడవాళ్లు కాటుకకు అంతలా బిజినెస్ ఉంది. అయితే నాటి కాలంలో వాడిన కాటుకతో కంటికి చాలానే లాభం ఉండేది. కానీ ప్రస్తుతం వాడుతున్న కాటుకల వల్ల కంటికి తీవ్ర నష్టమే జరుగుతోంది. అందుకే నిపుణులు అవసరం అయితే ఇప్పుడున్న కాటుకలను వాడవద్దని సలహాలు ఇస్తున్నారు.
అసలేందుకు మోడరన్ డేస్‌లో వచ్చిన కాటుకలను పెట్టుకోవద్దు :ఇప్పుడు వాడే కాటుకలన్నీ కమర్షియల్ కాటుకలే. చాలా కాలం నిల్వ ఉండడానికి వాటిలోకి రసాయనాలను కలుపుతున్నారు.
- లెడ్, నిల్వ ఉండటానికి ఉపయోగించే పారాబెన్స్, భార లోహాలు వంటివి కంటికి సైడ్ ఎఫెక్ట్స్‌ను తీసుకువస్తాయి.
- లెడ్ అయితే శరీరంలోకి ఇంకి మెదడు, ఎముకలపై తీవ్ర ప్రభావమే చూపుతుంది.
- అలాగే రక్తహీనతకు దారి తీస్తుంది.
- కింది కనురెప్పల్లో నూనె గ్రంథులు ఉంటాయి.
- ఇవి నీటిని విడుదల చేసి, కళ్లకు తేమ అందేలా చేస్తాయి.
- రసాయనాలతో కూడిన కాటుక రాయడం వల్ల అవి తెరుచుకోవు. దీంతో కళ్లుకు తగినంత తేమ అందక పొడిబారిపోతాయి.
- రసాయనాలు ఉన్న కాటుకలను వాడటం వల్ల కంటికి అలర్జీలు, గ్లకోమా, కార్నియల్ అల్సర్లు వంటివి వస్తాయి.
- పిల్లల్లో ఈ కాటుకల రిస్క్ మరీ ఎక్కువగా ఉంది.
- నాడీ వ్యవస్థపై ప్రభావం పడి నేర్చుకోవడం ఆలస్యమవడం, ప్రవర్తనా సమస్యలు తీవ్రమైతే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది.
కాటుక పెట్టుకోకపోవడమే మంచిది : అందుకే రోజూ కాటుక పెట్టకపోవడమే మంచిది. ఒకవేళ పెట్టుకున్నా కొద్దిసేపయ్యాక తీసేయడమే ఉత్తమం. ఈ కాటుకను ఇతరులతో పంచుకోవద్దు. కాటుకను కొనేటప్పుడే తుది గడువులు గమనించుకోవాలి. లెడ్ లేనివి చూసి ప్రత్యేకంగా ఎంచుకోవాలి. ఇంకా కాటుకకు బదులు ఐలైనర్, మస్కారా, ఐషాడో వంటివి ప్రయత్నించడం మేలు. ఇవైతే కంట్లోకి పోవు. కానీ శుభ్రం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.