SIB Ex DSP Praneeth Rao Case Updates :ఫోన్ ట్యాపింగ్ కేసులో తీగలాగే కొద్దీ సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎస్ఐబీ మాజీ డీఎస్పీని విచారించగా ఇద్దరు పోలీసు ఉన్నతాధికారుల ప్రమేయం బయటపడింది. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్ భద్రతవిభాగం అదనపు డీసీపీ తిరుపతన్న ఇళ్లకు శుక్రవారం రాత్రే వెళ్లిన పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. శనివారం ఉదయం వీరిద్దరినీ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు పిలిచి సుదీర్ఘంగా విచారించారు. అనంతరం రాత్రి సమయంలో అరెస్టు చేశారు.
Two Police Officers Arrested In Phone Tapping Case : విచ్చలవిడిగాఫోన్ ట్యాపింగ్‌లకు (Telangana Phone Tapping Case) పాల్పడిన వ్యవహారంలో ప్రణీత్‌తోపాటు వీరిద్దరి పాత్రను గుర్తించిన దర్యాప్తు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ ప్రముఖుల, వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేయడంలో వీరిద్దరి ప్రమేయం గురించి కీలకాధారాలను సేకరించే పనిలో దర్యాప్తు బృందం నిమగ్నమైంది. భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో, తిరుపతన్న ఎస్ఐబీలో అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు.
ప్రణీత్‌రావు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు - అన్ని నేరాలు చేశాడా?
లుక్‌ఔట్ సర్క్యులర్ జారీ : ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, ఐ న్యూస్ మీడియా నిర్వాహకుడు శ్రవణ్‌రావు పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురూ ఇప్పటికే దేశం దాటినట్లు వెల్లడి కావడంతో లుక్‌ఔట్ సర్క్యులర్ జారీ చేశారు. విచారణకు రావాలని గతంలో ఎస్ఐబీలో పనిచేసిన తొమ్మిది మందికి నోటీసులిచ్చారు. ఐ న్యూస్ మీడియా నిర్వాహకుడు శ్రవణ్‌రావు నైజీరియాకు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు.
శ్రవణ్‌రావు సూచించిన ఫోన్ నంబర్లనే ప్రణీత్‌రావు ట్యాపింగ్ చేసినట్లు తేలడంతో అతని ఇంట్లో జరిపిన సోదాల్లో కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం చెన్నైలో ఓ పవర్ కంపెనీ పత్రాలు శ్రవణ్ ఇంట్లో గుర్తించారు. రాంపల్లిలోని ఓ స్కూల్ దస్తావేజులు లభ్యమయ్యాయి. రెండు ల్యాప్‌టాప్‌లు, నాలుగు ట్యాబ్‌లు, అయిదు పెన్‌డ్రైవ్‌లు, ఒక హార్డ్‌డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు.