Shriram Finance Employee Sent Obscene Messages to a Woman :జాబ్ కోసం వచ్చిన మహిళకు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ అసభ్యకరమైన మెసేజ్‌లు చేస్తున్న ఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు శ్రీరామ్ ఫైనాన్స్ మల్లాపూర్ బ్రాంచ్‌లో స్థానికంగా ఉండే ఓ మహిళ ఉద్యోగం కోసం కంపెనీకి వెళ్లారు. ఉద్యోగం కోసం అప్లై చేసుకున్నారు. అందుకు ఆమె పూర్తి వివరాలు ఇచ్చారు. అందులో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న నగేశ్ అనే వ్యక్తి ఆ మహిళకు జాబ్ ఇప్పిస్తానని అందుకు తనుకు కమిట్‌మెంట్ ఇవ్వాలని వేధింపులకు దిగాడు. ఈ ఉద్యోగం కోసం చాలామంది ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికే లిస్టు చాలా పెద్దగా ఉందని మహిళకు తెలిపారు. వారందరికి కాకుండా ఆ ఉద్యోగం ఆమెకే రావాలంటే తనకు కమిట్‌మెంట్ ఇవ్వాలని కోరాడు.
'కమిట్‌మెంట్ ఇస్తే పక్కా ఉద్యోగం నీకే డియర్' - మహిళకు వేధింపులు, ఏం చేసిందంటే - HARASSMENT IN THE NAME OF JOB
ఉద్యోగం పేరిట మహిళకు అసభ్యకరమైన మెసేజ్‌లు - కమిట్‌మెంట్ ఇస్తే ఉద్యోగం వస్తదని ఎగ్జిక్యూటివ్ వేధింపులు - మల్లాపూర్‌లో ఘటన
Published : Nov 5, 2024, 6:54 PM IST
|Updated : Nov 5, 2024, 7:33 PM IST
ఇష్టం వచ్చినట్లు ఫోన్‌కు మెసేజ్‌లు :'లిస్ట్‌ల చాలా మంది ఉన్నారు, ముందుగా నువ్వు ఓకే చెప్తే పక్కాగా ఉద్యోగం నీకే' అని వేధింపులకు దిగాడు. మై డియర్ అంటూ ఫోన్‌కు ఇష్టారీతిన మెసేజ్‌లు పెడుతూ ఇబ్బందులకు గురిచేశాడు. బాధిత మహిళ తన భర్తకు ఈ విషయం తెలియజేయడంతో ఎగ్జిక్యూటివ్ నగేశ్‌పై నాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నగేశ్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై శ్రీరామ్ ఫైనాన్స్ స్పందించాల్సి ఉంది.
"శ్రీరామ్ ఫైనాన్స్ మల్లాపూర్ బ్రాంచ్ ఎగ్జిక్యూటివ్ నగేశ్ మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. మేము వచ్చి అడిగితే నా భార్య చేసింది అలాంటి మెసేజ్‌లు నేను కాదు అని అంటున్నాడు. నిన్న రాత్రి నా భార్యకు అసభ్యకరమైన మెసేజ్‌లు చేశాడు. నా భార్య భయపడి నిన్న చెప్పలేదు, ఇవాళ పొద్దున చెప్పింది. మై డియర్, ఒప్పుకో, ఈ జాబ్ కోసం చాలామంది లైన్‌లో ఉన్నారు అంటూ మెసేజ్‌లు చేశారు. ఇప్పుడు తనను దీని గురించి అడిగాలి. పోలీసులకు ఫిర్యాదు చేశాం."- బాధిత మహిళ భర్త
Woman Corporater was Harassed : 'సృజనా తిన్నావారా'.. అర్ధరాత్రి వేళ మహిళా కార్పొరేటర్‌కు ప్రజాప్రతినిధి ఫోన్