తెలంగాణ

telangana

ETV Bharat / state

శామీర్‌పేట పరిధిలో కారు బీభత్సం - ఇద్దరు యువకులు మృతి - Shamirpet Car Accident Today - SHAMIRPET CAR ACCIDENT TODAY

Shamirpet Car Accident Today : శామీర్‌పేట పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో కారు అదుపుతప్పి బస్సును ఢీ కొట్టబోయి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

Two People died in Car Accident
Shamirpet Car Accident Today (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 26, 2024, 9:57 AM IST

Updated : Jul 26, 2024, 10:54 AM IST

Shamirpet Car Accident Today : శామీర్‌పేట జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఇన్నోవా కారు మితిమీరిన వేగంతో అదుపుతప్పి డివైడర్​ పై నుంచి ఎదురు రోడ్డులో బోల్తా పడింది. అదే సమయంలో ఆ రూట్లో వస్తున్న బస్సు డ్రైవర్ అప్రమత్తమై రోడ్డు పక్కన పొదల్లోకి తీసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. కాగా మితిమీరిన వేగంతో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. బస్సులో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు.

Last Updated : Jul 26, 2024, 10:54 AM IST

ABOUT THE AUTHOR

...view details