Road Accidents in Andhra Pradesh Today : ఏపీలోనితిరుపతి, కృష్ణా జిల్లాల్లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎం.కొంగరవారిపల్లి వద్ద పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో లారీని కారు ఢీకొని మరో నలుగురు దుర్మరణం పాలయ్యారు. అనకాపల్లి జిల్లా న్యాయంపూడి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు.
Car Accident In Tirupati :తిరుపతి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. నెల్లూరు నుంచి వేలూరుకు వెళ్తున్న కారు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొంగరవారిపల్లి పూతలపట్టు, నాయుడుపేట జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేస్తున్నారు. పూతలపట్టు-నాయుడుపేట హైవేపై మరో ప్రమాదం జరిగింది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం సి.మల్లవరం వద్ద డివైడర్‌ను ఢీకొని రోడ్డుపైకి కారు దూసుకెళ్లింది. నిప్పురవ్వలు చెలరేగి కారుకు మంటలు అంటుకోగా అందులో ఉన్న ఇద్దరు అప్పటికే స్వల్పగాయాలతో బయటపడ్డారు.