తెలంగాణ

telangana

ETV Bharat / state

అలంకరణ పనికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం - ముగ్గురు కూలీలు మృతి - Three killed in Accident At guntur - THREE KILLED IN ACCIDENT AT GUNTUR

Road Accident at Pedakakani in Guntur District : గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. తొమ్మిది మందికి గాయాలయ్యాయి. వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, ధూళిపాళ్ల నరేంద్ర, గల్లా మాధవి ఆదేశించారు.

Road Accident at Pedakakani in Guntur District
Three Killed in a Road Accident at Pedakakani in Guntur District (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 11, 2024, 9:10 AM IST

Three Killed in a Road Accident at Pedakakani in Guntur District :అలంకరణ పనులకు వెళ్లి వస్తున్న కూలీలు కొద్ది సమయంలో ఇంటికి చేరేలోపు రోడ్డు ప్రమాదరూపంలో మృత్యువు కబళించింది. గుంటూరు జిల్లా పెదకాకాని జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 9 మందికి గాయాలు అయ్యాయి. మృతులు తేజ, రాంబాబు, మధుగా గుర్తించారు. క్షతగాత్రులు గుంటూరు జీజీహెచ్​లో చికిత్స పొందుతున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంసిమెంటు, కంకర కలిపే మిల్లర్‌ను ఐషర్‌ వాహనం వెనుక కట్టుకొని గుంటూరు వైపు తీసుకెళ్తోంది. పెదకాకాని అమెరికన్‌ ఆంకాలజీ క్యాన్సర్‌ ఆసుపత్రి ఎదుట ఉన్న జాతీయ రహదారి వద్దకు వచ్చే సరికి మరమ్మతులకు గురై రోడ్డు కుడివైపు నిలిచిపోయింది. ఆగి ఉన్న ఐషర్‌ వాహనాన్ని గమనించకపోవడంతో వెనుక నుంచి వచ్చిన కారు మిల్లర్‌ని బలంగా ఢీకొట్టింది. మిల్లర్‌ రోడ్డు మధ్యలోకి జరిగింది. ఇదే సమయంలో వెనుక వైపు నుంచి కూలీలతో వస్తున్న టాటా ఏస్‌ మినీ వాహనం మిల్లర్‌ని ఢీకొంది. భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు, హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

రహదారుల రక్త దాహం తీరేదెలా - ప్రభుత్వం, పౌర సమాజం ముందు ఉన్న సవాళ్లేంటి? - PRATHIDWANI ON CAUSES OF ACCIDENTS

ఈ ఘటనలో టాటా ఏస్‌లో ఉన్న పేరేచర్లకు చెందిన కె.రాంబాబు(40), గుంటూరు నగరానికి చెందిన తేజ (21) అక్కడికక్కడే మృతి చెందగా పాత గుంటూరుకు చెందిన డి.మధు (25) చికిత్స పొందుతూ మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో వైద్యులు ఐదుగురు క్షతగాత్రులకు వైద్య సేవలు అందిస్తున్నారు. కారులోని ముగ్గురు స్వల్పంగా గాయపడటంతో గుంటూరులోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. టాటా ఏస్‌లో 9 మంది కూలీలు ఉదయం విజయవాడ వెళ్లి శుభకార్యం అలంకరణ పనిముగించుకొని ఇంటికి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, ధూళిపాళ్ల నరేంద్ర, గల్లా మాధవి అధికారులను ఆదేశించారు.

భాగ్యనగరంలో రక్తమోడుతున్న రహదారులు - తీరని శోకసంద్రంలో మునిగిపోతున్న కుటుంబాలు - ROAD ACCIDENTS IN HYDERABAD

పెళ్లి బట్టలకు హైదరాబాద్​ వెళ్లొస్తుండగా ప్రమాదం - ఐదుగురు స్పాట్​ డెడ్​ - డ్రైవర్​ నిద్రమత్తే కారణం! - Car and Lorry Accident

ABOUT THE AUTHOR

...view details