Social Welfare Student Suicide : గురుకుల పాఠశాలలోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ ఎస్సీ బాలుర గురుకుల పాఠశాలలో కొన్నూరు గ్రామానికి చెందిన ప్రవీణ్ (12) ఏడో తరగతి చదువుతున్నాడు. మంగళవారం (నవంబర్ 26) రోజున పాఠశాల ఆవరణలో తోటి విద్యార్థులతో కబడ్డీ ఆడాడు. కబడ్డీ ఆడుతున్న సమయంలో ఇద్దరు విద్యార్థుల తలలు ఢీకొన్నాయి.
దీంతో ప్రవీణ్ అప్పటి నుంచి తల నొప్పిగా ఉందని చెప్పడంతో అక్కడ విధుల్లో ఉన్న ఉపాధ్యాయురాలు మాత్రలు ఇచ్చారు. ఉదయం పాఠశాలకు వచ్చిన తర్వాత మరో మారు మెడ, తల భాగంలో నొప్పి ఎక్కవగా వస్తుందని చెప్పడంతో ఉపాధ్యాయురాలు విద్యార్థి తండ్రి శ్రీనివాసులుకు ఫోన్ చేసి, మీ అబ్బాయికి తలనొప్పి వస్తుందని ఇబ్బంది పడుతున్నాడని చెప్పారు.
మందులిచ్చిన వైద్యుడు : తన తండ్రి ఫోన్ ప్రవీణ్‌కు ఇవ్వాలని చెప్పడంతో ఆమె ఫోన్ ఇచ్చింది. తండ్రితో ఫోన్ మాట్లాడిన విద్యార్థి అక్కడి నుంచి తరగతి గదిలోకి వెళ్లాడు. తలనొప్పి ఎక్కువ కావడంతో అక్కడ విధుల్లో ఉన్న వైద్యుడికి చూయించగా, మందులు ఇచ్చి వేసుకొని డార్మెటరీపై పడుకోమని చెప్పి వెళ్లిపోయారు. విద్యార్థిని డార్మెటరీలో తన స్నేహితుడు సాయంతో ఉన్నాడు. పాఠశాలలో పరీక్షలు జరుగుతుండడంతో తోడుగా ఉన్న విద్యార్థి తాను పరీక్ష రాసి వస్తానని, నువ్వు పడుకో ప్రవీణ్ అని చెప్పి వెళ్లాడు.