Thieves have Committed Massive Theft at Many Places in YSR District :ఉమ్మడి కడపజిల్లాలో వరుస దొంగతనలు పోలీసులకు సవాల్ విసురుతున్నాయి. 24 గంటల్లోనే పలు చోట్ల భారీ చోరీ ఘటనలు వెలుగులోకి రావడం చర్చాంశనీయంగా మారింది. ఈ ఘటనలతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తాళాలు వేసిన నివాసాలను, ఎంతో భద్రంగా ఉన్న ఏటీఎం యంత్రాలను, హైవేల మీద తిరిగే లారీలను సైతం లక్ష్యంగా చేసుకొవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వరుస చోరీలు జిల్లా పోలీసులకు సవాల్‌గా మారాయి.
సీసీ కెమెరాలకు నలుపు రంగు పూసి : వైఎస్సార్ జిల్లాలో అర్థరాత్రి వివిధ ప్రాంతాలలో పలు భారీ చోరీలు జరిగాయి. ఒకేసారి పెద్దసంఖ్యలో చోరీలు జరగడంతో ప్రజలతో పాటు పోలీసులు సైతం ఉలిక్కిపడ్డారు. ఈ వరుస చోరీలు పోలీసులకు పెను సవాల్‌గా మారింది. కడప ద్వారకా నగర్‌లోని ఎస్బీఐ(SBI) ఏటీఎంను దొంగలు గ్యాస్ కట్టర్‌తో తొలగించి అందులో ఉన్నరూ. 6 లక్షల నగదును దొంగలించారు. ఇదే గ్యాంగ్ ఒంటిమిట్టలో పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న మరో ఎస్బీఐ ఏటీఎం మిషన్‌ను గ్యాస్ కట్టర్ తో తొలగించి అందులో ఉన్న రూ. 36 లక్షల నగదును దొంగలించారు.
పోలీసులు గుర్తించకుండా సీసీ కెమెరాలకు నలుపు రంగు పూసి చోరీకి యత్నించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బ్యాంక్ అధికారులు పోలీసులు ఉదయం అక్కడికి చేరుకొని అందులో చోరీకి గురైన నగదును లెక్కించగా 36 లక్షల 11 వేలు అపహరణ జరిగినట్లు తేల్చారు. ఈ ఘటన పోలీస్ స్టేషన్ పక్కనే జరగడం అనుమానాలకు తావిస్తోంది. అలాగే విశ్వేశ్వరయ్య కూడలి వద్ద ఉన్న ఎస్బీఐ(SBI) ఏటీఎంను సైతం చోరీకి ప్రయత్నించగా అలారం మోగడంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు.
జాగ్రత్త - ఇంటికి తాళం వేశారో అంతా మాయమే - Thieves Robbery at House In kadapa
ఇంటి తలుపులు పగులగొట్టి : పులివెందులలోని హరినాథ్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో దాదాపు రూ. 25 లక్షల విలువ చేసే 380 గ్రాముల బంగారు నగలు, మూడు కిలోల వెండి, లక్ష రూపాయల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. హరినాథ్ రెడ్డి కుటుంబసభ్యులతో బెంగుళూరుకు వెళ్లడంతో గమనించిన దొంగలు రాత్రి ఇంటి తలుపులు పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. ఈరోజు ఉదయం తలుపులు తెరిచి ఉండడాన్ని పనిమనిషి గుర్తించి ఇంటి యజమాని హరినాథ్ రెడ్డికి ఫోన్ ద్వారా విషయం తెలియజేసింది. ఈ మేరకు హరినాథ్ రెడ్డి వాళ్లకు తెలిసిన వారికి ఫోన్ చేసి చూడమని చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
దొంగల కోసం సినీఫక్కీలో గ్రామస్థుల వేట- పోలీసుల రంగ ప్రవేశంతో కథ మలుపు! - villagers caught thieves
కత్తులు చూపించి చంపుతామని బెదిరించి : జిల్లాలోని కమలాపురం హైవేల మీద తిరిగే లారీలను టార్గెట్ చేసుకొని కొంత మంది దోపిడికీ పాల్పడుతున్నారు. లారీ డ్రైవర్లకు కత్తులు చూపించి చంపుతామని బెదిరించి వారి వద్ద ఉన్న డబ్బులు, సెల్ ఫోన్ లను దౌర్జన్యంగా లాక్కున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు తొమ్మిది మంది నిందితులను వలపన్నీ పట్టుకున్నారు. వీరంతా గంజాయి లాంటి మత్తు వ్యసనాలకు అలవాటుపడి ఇలాంటి దౌర్జన్యాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి మూడు కత్తులు, మూడు బైకులు, 7 సెల్ ఫోన్లు, కేజీన్నర గంజాయి, రూ.14,800 నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రంగనాయకులు తెలిపారు.
పై ఫ్లోర్ పడుకున్నారు.. కింద దోచుకెళ్లారు : అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని కృష్ణా నగర్ లో ఇంద్రావతి అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ఇంట్లో తెల్లవారుజామున చోరీ జరిగింది. ఇంటిపై భాగంలోని గదిలో నిద్రిస్తుండగా కింది భాగంలోని మరో గదిలో దొంగతనం జరిగిందని బాధితురాలు తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా కూడపెట్టుకున్న నగదు, బంగారాన్ని దుండగులు దోచుకెళ్లారని బాధితురాలు వాపోయారు. ఘటనలో సూమారు 20 తులాల బంగారం, మూడు లక్షల రూపాయల నగదు చోరీ జరిగిందని బాధితురాలు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు ఎన్ని రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ దొంగలు మాత్రం తమ పని తాము కానిస్తున్నారు. రాత్రి వేళల్లో పూర్తిస్థాలు పెట్రోలింగ్ లేకపోవడంతోనే దొంగలు చోరీలకు పాల్పడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్థానిక దొంగలా? హర్యానా గ్యాంగ్? : అలాగే రాజంపేటలో కూడా దాదాపు 200 గ్రాముల బంగారు నగలు, లక్ష రూపాయల నగదును దొంగలించారు. వీటితోపాటు కడప నగరంలో 20 గ్యాస్ సిలిండర్లు చోరీకి గురయ్యాయి. ఒకేసారి ఈ స్థాయిలో చోరీలు జరగడం జిల్లాలో ఇదే మొదటిసారి. దీంతో జిల్లా పోలీస్ యంత్రాంగం మెుత్తం అప్రమత్తమైంది. చోరీలకు పాల్పడిన దొంగల వేలిముద్రలను పోలీసులు పరిశీలించారు. ఏటీఎంల చోరీలకీ పాల్పడింది స్థానిక దొంగలా? లేదా హర్యానా గ్యాంగ్? అనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగల కోసం గాలిస్తున్నారు.
నోట్ల కట్టల బదులు వాటర్ బాటిళ్లు- చోరీ కేసును పోలీసులు కేసును ఎలా ఛేదించారంటే! - JADCHERLA BUS THEFT CASE SOLVED