ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా 76వ గణతంత్ర వేడుకలు - REPUBLIC DAY CELEBRATIONS IN AP

ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలలు, కళాశాలల్లో జెండా ఆవిష్కరణ- వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు

76th Republic Day Celebrations In Andhra Pradesh
76th Republic Day Celebrations In Andhra Pradesh (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 26, 2025, 12:02 PM IST

Updated : Jan 26, 2025, 2:27 PM IST

76th Republic Day Celebrations Across The State: రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా 76వ గణతంత్ర వేడుకలు జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలలు, కళాశాలల్లో జెండా ఆవిష్కరణ ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

అసెంబ్లీ ప్రాంగణంలో జెండాను ఆవిష్కరించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు: అసెంబ్లీ ప్రాంగణంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. శాసనసభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సభాపతి రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు. రాజ్యాంగం స్వేచ్ఛ, సమానత్వం, ఓటుహక్కు కల్పించిందని అయ్యన్నపాత్రుడు స్పష్టంచేశారు. సమైక్య స్ఫూర్తిని, రాజ్యాంగ విలువల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్​ను అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన శాసనమండలి ఛైర్మన్: శాసనమండలిలో ఛైర్మన్ మోషేన్ రాజు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ప్రజలు తమ హక్కులు గురించి తెలుసుకోవాలని మోషేన్ రాజు తెలిపారు. పాఠ్యాంశాల్లో రాజ్యాంగ విలువల్ని పొందుపరచాలన్నారు. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిన్నారులకు సీఎస్ కె.విజయానంద్ మిఠాయిలు పంచారు..

హైకోర్టులో.. హైకోర్టు ప్రాంగణంలో ఘనంగా 76వ గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సమైక్య స్ఫూర్తిని పెంపొందించుకుని ప్రతి ఒక్కరూ ఎంచుకున్న రంగాల్లో ముందుకు సాగాలని అందరికీ పిలుపునిచ్చారు.

నెల్లూరులో.. నెల్లూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో జిల్లా కలెక్టర్ ఆనంద్ జెండా ఎగురవేసి పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ శాఖల శకటాలు ఆకట్టుకున్నాయి. దేశభక్తిని పెంపొందించేలా సాగిన సాంస్కృతి కార్యక్రమాలు అందరినీ అలరించాయి.

కడప జిల్లాలో.. కడప పోలీసు పరేడ్ మైదానంలో జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. కలెక్టర్ పోలీసుల గౌరవ వందనాన్ని కలెక్టర్ స్వీకరించారు. కార్యక్రమంలో ప్రభుత్వశాఖల శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. డాగ్ స్వ్కాడ్ విన్యాసాలు అలరించాయి. వివిధ పాఠశాలల విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా స్వాతంత్య సమరయోధుల కుటుంబ సభ్యులను సత్కరించారు.

ప్రకాశంలో.. ఒంగోలు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో కలెక్టర్‌ తమీమ్‌ అన్సారీయా పతాకావిష్కరణ చేశారు. పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి స్వాట్‌ టీమ్‌ ప్రదర్శించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌, అధికారులు పాల్గొన్నారు

తూర్పుగోదావరిలో.. తూర్పుగోదావరి జిల్లాలో గణతంత్ర వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగిన వేడుకల్లో కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిషోర్ జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. కలెక్టర్ శకటాల ప్రదర్శన తిలకించి వందనం స్వీకరించారు.

పశ్చిమగోదావరిలో.. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. తణుకులో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొని జెండాను ఎగురవేశారు. తణుకు మున్సిపల్ కార్యాలయంలోనూ టీడీపీ కార్యాలయంలోనూ పతాకాలను ఆవిష్కరించారు.

అల్లూరి జిల్లాలో.. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో గణతంత్ర వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో కలెక్టర్ దినేష్ కుమార్ పాల్గొన్నారు. పోలీస్ కవాతుతో విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఐటీడీ ప్రాజెక్టు అధికారి అభిషేక్, ఎస్పీ అమిత్ బర్దర్ తదితరులు హాజరయ్యారు.

చంద్రబాబు విజనరీ నాయకుడు- ఏపీ అభివృద్ధికి పాటుపడ్డారు: గవర్నర్ - Governor Speech in AP Assembly

రాష్ట్రవ్యాప్తంగా రిపబ్లిక్​ డే వేడుకలు మురిసిన మువ్వన్నెల జెండా

అట్టహాసంగా గణతంత్ర వేడుకలు.. జెండా ఎగురవేసిన ముర్ము.. హాజరైన ఈజిప్ట్ అధ్యక్షుడు, ప్రధాని మోదీ

Last Updated : Jan 26, 2025, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.