తెలంగాణ

telangana

ధవళేశ్వరం వద్ద మహోగ్ర గోదావరి - రెండో ప్రమాద హెచ్చరిక జారీ - Heavy Floods in Konaseema

By ETV Bharat Telangana Team

Published : Jul 27, 2024, 5:32 PM IST

People Facing Problems in Konaseema : ఏపీలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కోనసీమ జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆనకట్ట వద్ద 13.75 అడుగులకు నీటిమట్టం చేరింది. 13 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో ఉంది.

SECOND WARNING AT DAWALESWARAM
People Facing Problems in Konaseema (ETV Bharat)

ధవళేశ్వరం వద్ద మహోగ్ర గోదావరి - రెండో ప్రమాద హెచ్చరిక జారీ (ETV Bharat)

SECOND WARNING AT DAWALESWARAM :ఆంధ్రప్రదేశ్‌లోగోదావరికి మళ్లీ వరద ఉద్ధృతి క్రమక్రమంగా పెరుగుతోంది. నిన్నంతా హెచ్చుతగ్గులతో కొనసాగిన వరద, ఇవాళ ఉదయం నుంచి మళ్లీ పెరుగుతూనే ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద రాజమహేంద్రవరం చేరుతోంది. ధవళేశ్వరం సర్ కాటన్ ఆనకట్ట వద్ద ప్రస్తుతం 13.75 అడుగులకు చేరింది. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 13 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో ఉంది. కాలువలు, కల్వర్టులకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.

భద్రాచలం వద్ద డేంజర్ బెల్స్ - 53.2 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం - మూడో ప్రమాద హెచ్చరిక జారీ - BHADRACHALAM GODAVARI WATER LEVEL

Heavy Floods in Konaseema :కోనసీమలోని లంకల్ని మరింతగా వరద నీరు చుట్టుముట్టేస్తోంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు కారణంగా గోదావరికి వరద నీరు పోటెత్తింది. లంక ప్రాంతాల్లో గౌతమి గోదావరి, వశిష్ట గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. లంక గ్రామాల్లో అరటి, కూరగాయల తోటలు పూర్తిగా నీటమునిగాయి.

ఇంకా వరద గుప్పిట్లోనే..వర్షం తగ్గినా కోనసీమ లంక గ్రామాలు ఇంకా వరద గుప్పిట్లోనే ఉన్నాయి. ముమ్మిడివరం మండలంలోని పలు గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ప్రధాన రహదారులు, అంతర్గత రహదారులపై వరద నీరు భారీగా ప్రవహించడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు, ప్రజలు బాహ్య ప్రపంచంలోకి పడవల ద్వారా రావాల్సివస్తోంది. కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాంలో గౌతమి గోదావరి బాలయోగి వారధి వద్ద వరద పోటెత్తుతుంది. రాజీవ్‌ బీచ్‌ పరివాహక ప్రాంతంలో ఉండే పుదుచ్చేరి పర్యాటక శాఖకు చెందిన వాటర్‌ స్పోర్ట్స్‌ ప్రదేశం నీట మునిగింది.

బాహ్య ప్రపంచంతో సంబంధాలు బంద్‌ ..గోదావరి వరదలతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన లంక గ్రామాల ప్రజలు దుర్భర జీవితం గడుపుతున్నారు. కోనసీమ జిల్లా ఉడుముడి లంక గ్రామంలో తాజాగా ఇలాంటి హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఉడుముడి లంకకు చెందిన జేమ్స్‌ అనే వ్యక్తికి వెన్నునొప్పి రావడంతో నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. గ్రామం గోదావరి మధ్యలో ఉండటం, నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబసభ్యులు అవస్థలు పడ్డారు. మంచంపై జేమ్స్‌ను పడుకోబెట్టి నలుగురు వ్యక్తును ఉడుముడి లంక నుంచి గోదావరి రేవు వరకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి అమలాపురంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

రోజువారి జీవనానికి తీవ్ర ఇబ్బందులు..ముమ్మిడివరం నియోజవర్గ పరిధిలో గోదావరి వరద నిలకడగా కొనసాగుతోంది. ముమ్మిడివరం మండలంలోని లంక గ్రామాలైన గురజాపులంక, కూనాలంక, ఠానేలంక చెందిన మెట్ట పంటలు, గ్రామాలు ఇంకా ముంపు నీటిలోనే నానుతున్నాయి. ప్రధాన రహదారులు, అంతర్గత రహదారులపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఇప్పటికి ముంపు నీటిలోనే లంక వాసులు రాకపోకలు సాగిస్తున్నారు. వరద నీటికి తోడు నిన్న (శుక్రవారం) రాత్రి నుండి ఏకధాటిగా వర్షాలు పడుతుండటంతో రోజువారి జీవనానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తెలంగాణకు అలర్ట్ - మరో మూడ్రోజులు మోస్తరు వర్షాలు - TELANGANA WEATHER UPDATES

కోనసీమను వీడని ముంపు - జలదిగ్బంధంలోనే లంక గ్రామాలు - floods in konaseema

ABOUT THE AUTHOR

...view details