Road Accident in Tirumala Ghat Road : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఓ వాహనం అదుపుతప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. తిరుమల నుంచి తిరుపతికి వస్తుండగా ప్రమాదం జరిగింది. 19వ మలుపు వద్ద వేకువ జామున స్కార్పియో వాహనం డివైడరును ఢీ కొట్టింది. ఆ తర్వాత అదుపుతప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు భక్తులు గాయపడ్డారు. వారిని వెంటనే తిరుపతి రుయా ఆస్పత్రి తరలించారు.
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం - పొదల్లోకి దూసుకెళ్లిన స్కార్పియో - ROAD ACCIDENT IN TIRUMALA GHAT ROAD
19వ మలుపు వద్ద డివైడర్‌ను ఢీకొన్న స్కార్పియో వాహనం - ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ వాసులకు గాయాలు
Road Accident in Tirumala Ghat Road (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 25, 2025, 12:08 PM IST