Snake Show in Paderu : గణతంత్ర దినోత్సవ సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో అటవీశాఖ వారు ప్రభుత్వ స్టాల్‌ను ఏర్పాటు చేశారు. పాడేరులోని తలార్సింగ్ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన పాముల ప్రదర్శన అక్కడి వారిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా తూర్పు కనుమల వన్యప్రాణి సంరక్షణ సంస్థ ఆధ్వర్యంలో వివిధ రకాల పాములను ప్రదర్శించారు. ఇందులో జెర్రిపోతు, రక్తపింజర, నాగుపాము, సాండ్ స్నేక్ ఉన్నాయి. వీటి గురించి అధికారులు వివరిస్తూ అవి కాటు వేస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు.
అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సంచరించే గిరినాగులపై కూడా అధికారులు అవగాహన కల్పించారు. అరుదైన, అతిపెద్ద విషపూరిత ప్రాణుల్లో ఇది కూడా ఒకటని తెలిపారు. దాదాపు 10 నుంచి 15 అడుగుల పొడవు ఉంటాయని పేర్కొన్నారు. అయితే ఈ కింగ్కోబ్రాలు అంతరించేపోయే జంతుజాతుల జాబితాలో చేరాయని వివరించారు. అరుదైన వీటిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. వీటి గుడ్లను సంరక్షిస్తున్నామని కింగ్‌కోబ్రా పిల్లలు కొంత పెద్దవిగా అయిన తర్వాత వాటిని తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టనున్నట్లు వెల్లడించారు.
Paderu Snake Stall : గిరినాగులు విషపూరితమైనప్పటికీ మనుషులు చూస్తే పారిపోతాయని అధికారులు వివరించారు. దీని బారిన పడి చనిపోయిన వారు పెద్దగా లేరని చెప్పారు. ఇవి పాములను తిని బతుకుతాయని అన్నారు. వీటివల్ల ప్రజలకు ఉపయోగకరమని తెలిపారు. ఏడుగురు సభ్యుల బృందంతో కింగ్‌కోబ్రాలను సంరక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ సభ్యుడు కంటి మహంతి, తదితరులు పాల్గొన్నారు.
'కింగ్ కోబ్రాకు కష్టమొచ్చింది'- ఆడ కోబ్రా వెళ్లిపోవడంతో గుడ్ల సంరక్షణ - KING COBRA EGGS
నేవీ క్వార్టర్స్‌లో గోల్డ్ స్నేక్ - ఆసక్తిగా తిలకించిన స్థానికులు