Scientist Invented Pills in Alternate To Exercise to Lose Weight : 'కష్టపడకుండా కూర్చుంటే ఒంట్లో కొవ్వు కరగదు. వ్యాయామం చేయాలి. చక్కని ఆహార నియమాలు పాటించాలని చెబుతుంటారు వ్యాయామ నిపుణులు. కొన్నిసార్లు ఎంత చేసినా మార్పు కనిపించట్లే అనిపిస్తుంటుంది. 'అరే.. ఇంత చేసినా బరువు తగ్గట్లే ఏంటి?' అని నిరాశ కలుగుతుంది. ఇలాంటివి వినడాలు, ప్రయత్నించడాలు ఇక అవసరం లేదు. వాటికి తెర దింపడానికి ఓ వ్యాయామ మాత్ర వచ్చింది. అవును నిజమే. ఆహారానికి ప్రత్యామ్నాయంగా కొన్ని మాత్రలు వచ్చినట్టు, ఇప్పుడు వ్యాయామం అవసరం లేకుండా అదే స్థాయి ఫలితాన్ని ఇచ్చే బిళ్లను కనిపెట్టారు శాస్త్రవేత్తలు. 10 కిలోమీటర్లు పరుగు పెడితే ఎంత ప్రయోజనం ఉంటుందో, అంత లాభం వస్తుందంటా ఈ మాత్రతో.
సమానంగా పని చేస్తోంది : లేక్ అనే ఈ మాత్రను డెన్మార్క్‌లోని ఆరూస్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఆవిష్కరించారు. మనం బాగా వ్యాయామం చేసినప్పుడు శరీరంలో లాక్టేట్, కీటోన్స్ ఏర్పడి, అవి ఆకలిని ప్రేరేపించే హార్మోన్లను నియంత్రిస్తాయి. ఈ లేక్ మాత్రం ఆ పరిణామాన్నే శరీరంలో కృత్రిమంగా కల్పిస్తుంది. అందుకే లాక్టేక్, కీటోన్స్‌లోని తొలి అక్షరాలని తీసుకుని ఈ మందు బిళ్లకు లేక్ అని పేరు పెట్టారు.
సండే "మారథాన్"లో పాల్గొనాలనుకుంటున్నారా? - ఈ విషయాలు తెలుసుకోకపోతే ఆరోగ్యానికి నష్టం తప్పదట!