Two People Lost RS.2.43 crore In Cyber Fraud in Hyderabad :పెట్టుబడులకు భారీగా లాభాలు వస్తాయంటూ, స్టాక్ ట్రేడింగ్ పేరిట నమ్మించి సైబర్ నేరగాళ్లు వేర్వేలు ఘటనల్లో ఇద్దరి నుంచి రూ.2.4 కోట్లు దోచుకున్నారు. ఇందులో ఓ వ్యక్తి పర్సనల్ లోన్ తీసుకుని మరి పంపించడం గమనార్హం.
వారు చెప్పిన యాప్ డౌన్లోడ్ చేసుకుని మరి :పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ జాతీయ పరిశోధన సంస్థలో పనిచేస్తున్న శాస్త్రవేత్త ఫోన్ నెంబరును గుర్తుతెలియని వ్యక్తులు డిసెంబరు చివరి వారంలో ఓ వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేశారు. స్టాక్ ట్రేడింగ్ చేస్తే బాగా డబ్బు వస్తుందని నమ్మించారు. తాము ట్రేడింగ్‌కు సంబంధించి సలహాలు, సూచనలు ఇస్తామని గ్రూప్‌లో సందేశాలు పంపించేవారు. ఇదంతా నిజమని నమ్మిన శాస్త్రవేత్త వారు చెప్పినట్లు యాక్సిస్ సెక్యూరిటీస్ లిమిటెడ్ పేరుతో ఉన్న యాప్‌ను డౌన్లోడ్ చేయించారు. మొదటగా షేర్లు కొనుగోలు చేసి నాలుగైదు రోజుల్లో మంచి ధర వస్తే విక్రయించాలని సూచించారు. ఇలా షేర్లు కొనుగోలు చేయించి ఆ డబ్బును వేర్వేలు ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు.
లాభం విత్‌డ్రా చేసుకుందాం అనేలోగా: మొదట్లో షేర్లు కొన్నందుకు శాస్త్రవేత్తకు రూ.50వేల లాభం వచ్చింది. ఇదంతా నిజమేనని నమ్మిన శాస్త్రవేత్త భారీగా లాభాలు వస్తాయని ఆశపడి డిసెంబరు 24 నుంచి 18 రోజుల్లో 16 లావాదేవీల్లో రూ.1.22 కోట్లు నేరగాళ్లకు పంపించాడు. షేర్ల కొనుగోలుకు డబ్బులు సర్దుబాటు కాకపోతే వ్యక్తిగత రుణం తీసుకుని మరీ నేరగాళ్లకు పంపాడు. అయితే పెట్టుబడితో కలిపి లాభం రూ.3.26 కోట్లు నకిలీ యాప్‌లో చూపించింది. కానీ విత్‌డ్రా చేసుకునేందుకు మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. దీంతో ఆయన వాట్సాప్ ద్వారా వారిని సంప్రదించగా ఇప్పుడే విత్‌డ్రా వద్దని, లాభం మరింత రావాలంటే ఇంకా పెట్టుబడి పెట్టాలంటూ నేరగాళ్ల మెలికపెట్టారు. కానీ శాస్త్రవేత్త మాత్రం విత్‌డ్రాకు అవకాశం ఇవ్వాలని ఒత్తిడి తీసుకురాగా అదనంగా రూ.కోటి పంపించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో శాస్త్రవేత్త సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విరాళాలు ఇస్తామంటూ వచ్చే లింకులను నమ్మకండి - ఎందుకో చెప్పిన సైబర్ క్రైమ్ పోలీసులు