SBI Bank Alert on Deepfake Videos :ఎస్బీఐ (భారతీయ స్టేట్ బ్యాంక్)పేరిట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రకటనలపై తాజాగా ఆ బ్యాంకు స్పందించింది. అవి డీప్‌ఫేక్ వీడియోలని, అలాంటి ఫేక్ వీడియోలను నమ్మి ఎవరూ మోసపోవద్దని తమ ఖాతాదారులకు, ప్రజలకు సూచించింది. ఎస్‌బీఐ ఎప్పుడూ ఇలాంటి ప్రకటనలు చేయదని బ్యాంకు వర్గాలు స్పష్టం చేశాయి. ఈ మేరకు ఎస్‌బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది.
సోషల్ మీడియాలో ఫేక్ ప్రకటనలేంటి? : ఎస్‌బీఐకి చెందిన ఉన్నతాధికారుల పేర్లతో ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ ప్రకటనలను జారీ చేసినట్లు ఎస్బీఐ గుర్తించింది. ఈ డీప్ ఫేక్ వీడియోలపై బ్యాంకు వినియోగదారులను ముందు జాగ్రత్తగా అప్రమత్తం చేసింది. పెద్ద ఎత్తున లాభాలు వస్తాయంటూ ఎస్బీఐ మేనేజ్మెంట్ వెల్లడించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలన్నీ ఫేక్ అని స్పష్టం చేసింది. ఎస్‌బీఐ ఎప్పుడూ ఇలాంటి ప్రకటనలను చేయదని బ్యాంకు అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. ఇలాంటి వాటిని చూసి వినియోగదారులు మోసపోవద్దని తెలిపింది.