ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీతేజ్​ కుటుంబానికి పుష్ప టీమ్​ రూ.2 కోట్లు సాయం - 2 CRORE COMPENSATION REVATHI FAMILY

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటన బాధిత కుటుంబానికి రూ.2 కోట్లు పరిహారం - చెక్కులను ఎఫ్‌డీసీ ఛైర్మన్‌కు అందించిన అల్లు అరవింద్

Rs.2 Crore Compensation to Sandhya Theater Stampede Victim's Family
Rs.2 Crore Compensation to Sandhya Theater Stampede Victim's Family (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 25, 2024, 2:59 PM IST

Updated : 24 hours ago

Rs.2 Crore Compensation to Sandhya Theater Stampede Victim's Family :సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి పుష్ప2 టీమ్ రూ.2 కోట్ల సాయం అందజేయనున్నట్లు నిర్మాత అల్లు అరవింద్‌ తెలిపారు. కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించిన అనంతరం పరిహారాన్ని ఆయన ప్రకటించారు. సంబంధిత చెక్కులను తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌, నిర్మాత దిల్‌ రాజుకు అల్లు అరవింద్‌ అందజేశారు. పుష్ప 2 నిర్మాతలు రెండు రోజుల క్రితం శ్రీతేజ్‌ తండ్రికి రూ.50 లక్షల చెక్కును అందజేసిన విషయం తెలిసిందే.

తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌, నిర్మాత దిల్‌ రాజు, పుష్ప 2 నిర్మాత రవి శంకర్‌తో కలిసి అల్లు అరవింద్‌ కిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లారు. శ్రీతేజ్‌ను ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుకున్నారు. శ్రీతేజ్‌ తండ్రి భాస్కర్‌తో వారు మాట్లాడారు. అనంతరం అల్లు అరవింద్‌ మీడియా సమావేశం నిర్వహించి శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితి వివరాలను తెలిపారు.

సంధ్య థియేటర్ ఘటనపై తప్పుడు సమాచారం - పోలీసులు సీరియస్

మనందరి మధ్య ఆరోగ్యంగా తిరుగుతాడు : నటుడు అల్లు అర్జున్‌ తరఫున రూ.కోటి, పుష్ప 2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు అల్లు అరవింద్‌ తెలిపారు. శ్రీతేజ్‌ ప్రస్తుతం కోలుకుంటున్నాడని, వెంటిలేషన్‌ తీసేశారని తెలిపారు. శ్రీతేజ్‌ త్వరలోనే మనందరి మధ్య ఆరోగ్యంగా తిరుగుతాడని ఆశిస్తున్నానని అన్నారు. లీగల్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ వల్ల రేవతి కుటుంబ సభ్యులను కలవలేకపోతున్నానని తెలిపారు. అన్ని రకాల అనుమతులు తీసుకుని శ్రీతేజ్‌ను పది రోజుల క్రితం పరామర్శించానని, ఆ సమయంలో వెంటిలేషన్‌పై ఉన్నాడని ఆయన గుర్తు చేశారు.

రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తాం :నిన్నటికి, ఈరోజుకి శ్రీతేజ్‌ ఆరోగ్యం కాస్త మెగురుపడిందని, అతడి హెల్త్‌ కండిషన్‌ బాగుందని వైద్యులు తెలిపారని దిల్ రాజు అన్నారు. బాలుడి కుటుంబానికి అల్లు అర్జున్‌, పుష్ప 2 నిర్మాతలు, దర్శకుడు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అపాయింట్‌మెంట్‌ అడిగామని, సినీ ప్రముఖులతో సీఎంని కలిసి సినీ పరిశ్రమ గురించి చర్చిస్తామని అన్నారు. దర్శకులు, హీరోలు, నిర్మాతలం కలిసి వెళ్తామని, గురువారం ఉదయం పది గంటలకు సమావేశం ఉంటుందని ఆయన తెలిపారు.

'రేవతి చనిపోయిందని థియేటర్​లో నాకు చెప్పలేదు' - భావోద్వేగానికి గురైన అల్లు అర్జున్​

సీఎం రేవంత్​ను కలిశా - అల్లు అర్జున్​ను కలుస్తాను - ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తా: దిల్ రాజు

Last Updated : 24 hours ago

ABOUT THE AUTHOR

...view details