Sabala Millets Stall :హైదరాబాద్ మణికొండ ల్యాంకో హిల్స్‌లో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా రామోజీ గ్రూపు ఆధ్వర్యంలో సబల స్టాల్ ఏర్పాటు చేశారు. ఇటీవలే సబల పేరిట మార్కెట్‌లోకి తీసుకొచ్చిన చిరుధాన్యాల ఉత్పత్తులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మిల్లెట్ నూడిల్స్, ప్రొటీన్ మీల్ బార్, మల్టీ మిల్లెట్ టిఫిన్ మిక్స్, వన్ పాట్ మిల్లెట్ మీల్ మిక్స్, ప్రొటీన్ మీల్ బార్, ప్రొటీన్ డేట్ అండ్ అల్మండ్ బార్, మిల్లెట్ పఫ్స్, మిల్లెట్ జాగరీ కుకీస్, బేక్డ్ మిల్లెట్ నట్ క్రాకర్ వంటివి చిరు ధాన్యాల మీద ఆసక్తి కలిగిస్తున్నాయి.
అలాగే పొంగల్, సాంబార్ మీల్, ఉప్మా, కేసర్ బాదం మీల్, మూంగ్ కిచిడీ, మసాలా కిచిడీ, చక్కర పొంగల్, రాజస్థానీ మూంగ్ దాల్, తమిళనాడు సక్కరాయి పొంగల్, తమిళనాడు పొంగల్, గుజరాతీ వెంఘరేలి కిచిడీ, బెంగాళీ షోగర్ కిచిడీ, కర్ణాటక బిస్మల్లాబాత్, మిల్లెట్ మొరింగా, మిల్లెట్ కోకా, మిల్లెట్ ఓట్స్ వంటివి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు ప్రియా పచ్చళ్లు సైతం స్టాల్‌లో అందుబాటులో ఉంచారు. ఎప్పట్నుంచో చిరుధాన్యాలు ఆహారంలో భాగం చేసుకుంటున్నామని నాణ్యత, మన్నికకు మారుపేరైన సబల బ్రాండ్ ఉత్పత్తులను రుచి చూస్తామని వినియోగదారులు చెబుతున్నారు.
హైదరాబాద్ వాసులు ఫిదా : భారతీయ చిరుధాన్యాలను ఆధునిక చిరుతిండిగా పునర్నిర్వచించడం సబల బ్రాండ్ లక్ష్యం. అంతరించిపోతున్న సూపర్ గ్రెయిన్‌ల శక్తిని పోషకాహారం రూపంలో నోరూరించే రుచితో పాటు సంపూర్ణ సమతుల్యతతో తీసుకొచ్చిన ఉత్పత్తులకు హైదరాబాద్ వాసులు ఫిదా అయిపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వ్యాపార సంస్థలు ఇలా ఎక్కడైనా స్నాక్స్, కుక్కీలు, నూడుల్స్ వంటివెన్నో ఆహారంలో భాగం చేసుకునేలా రూపొందించి అందిస్తున్నారు.
"ప్రియా పచ్చళ్ల నుంచి ఇప్పటి వరకు రామోజీ గ్రూపు ఏం చేసినా లాభాలు చూసుకోకుండా క్వాలిటీని చూసుకుంటున్నారు. అందుకే ప్రజల మన్ననలు పొందుతున్నారు. రామోజీ గ్రూపు వాళ్లు మా కమ్యూనిటీకి రావడం, ఇక్కడ స్టాల్ నిర్వహించడం శుభపరిణామం. ఆ బ్రాండ్ చూస్తేనే కళ్లు మూసుకొని కొనుక్కోవచ్చనే భరోసా ఉంది. రామోజీ గ్రూపు నుంచి వచ్చే ప్రతి ప్రోడక్టును అందరూ తప్పనిసరిగా ఆదరిస్తారు."- శ్రీనివాస్, లాంకో హిల్స్, హైదరాబాద్