Rules and Regulations of New Ration Card in Telangana :రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డుల జారీకి విధి విధానాలు రూపొందిస్తున్న మంత్రివర్గ ఉపసంఘం, ఆయా కుటుంబాల వార్షిక ఆదాయ పరిమితిని కూడా నిర్ణయించనుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో రెండు రకాల ఆదాయ పరిమితుల బట్టి రేషన్ కార్డులు జారీ చేశారు. కొత్త రేషన్ కార్డులను ఇవ్వనున్న నేపథ్యంలో ఆదాయ పరిమితిని మార్చాలా, తగ్గించాలా, ఉన్నదాన్నే కొనసాగించాలా అన్నదానిపై కమిటీ కసరత్తు చేస్తోంది. దీనిపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ నేతృత్వంలో పలువురు అధికారులు గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధి విధానాలను అధ్యయనం చేశారు.
నివేదికలో పలు మార్పులు :ఆ నివేదికను ఉపసంఘానికి అందజేయగా, దానిపై చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో రేషన్‌కార్డును ఒక్క పౌర సరఫరాల వస్తువులను తీసుకోవడానికే కాకుండా పలు సంక్షేమ పథకాల్లోనూ ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయ పరిమితి నిర్ధారణ విషయంలో కొత్త రేషన్, హెల్త్‌కార్డుల జారీపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం పలు మార్పులను చేయాలని యోచిస్తోంది. పరిమితిని తగ్గిస్తే ఎంత వరకు తగ్గించాలి, ఇప్పుడున్నట్లు కొనసాగిస్తే అర్బన్ ఏరియాల్లోనే అదే పరిమితిని ఉంచాలా లేదా, లేక తగ్గించాలా, ఆదాయం వ్యత్యాసం ఉంటుంది కావున ఇలా అన్ని కోణాల్లో సంఘం తాజాగా చర్చించినట్లు తెలిపింది.
తెల్లరేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - జనవరి నుంచి సన్న బియ్యం - MINISTER UTTAM ON RATION RICE
తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ, అర్బన్ ఏరియాలుగా వార్షికాదాయ పరిమితిని అమలు చేస్తున్నారు. దీని ఆధారంగానే తెల్ల రేషన్‌కార్డును ప్రభుత్వాలు ఇస్తున్నాయి. గ్రామీణ ప్రాంతంలో రూ.1.50 లక్షలు, అర్బన్ రూ.2 లక్షల్లోపు ఆదాయాన్ని కార్డుల జారీకీ ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. భూ విస్తీర్ణం తరి భూమి అయితే 3.5 ఎకరాలు, మాగాణి భూమి అయితే 7.5 ఎకరాలలోపు ఉండాలనే నిబంధనలు అమలు చేస్తున్నారు.