RSS Sangh Parivar Kshetras Meeting at Hyderabad : ఆర్ఎస్ఎస్ పరివార క్షేత్రాల కీలక సమావేశంలో బీజేపీ(BJP) తీరుపై సంఘ్ పరివార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమావేశాలు హైదరాబాద్‌లో జరిగాయి. 2014 పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరిగిన తరహాలోనే 2024 ఎన్నికల ముందు భేటీ అయినా ఆర్ఎస్ఎస్ వివిధ క్షేత్రాల ప్రముఖులు పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తుత పరిస్థితులు, తెలంగాణలో బీజేపీ పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ సీట్లే లక్ష్యంగా జరిగిన ఆర్ఎస్ఎస్ పరివార క్షేత్రాల సమావేశానికి ఆర్ఎస్ఎస్(RSS) నుంచి జాతీయ సహా ప్రధాన కార్యదర్శులు(సహ సర్ కార్యవాహలు) ముకుంద, అరుణ్ కుమార్, బీజేపీ నుంచి సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్ సంతోష్, సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాశ్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ హాజరయ్యారు. మొదటిసారిగా సంఘ్ సమావేశానికి డీకే అరుణ, ఈటల రాజేందర్ హాజరయ్యారు.
అలాగే ఈ సమావేశంలో ఏబీవీపీ, బీయంఎస్, వీహెచ్‌పీ, విద్యాపీఠ్, వనవాసి కల్యాణ్ పరిషత్, కిసాన్ సంఘ్, ఇతర క్షేత్రాల ముఖ్య నేతలు పాల్లొన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ పరిస్థితిపై పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ వివరించారు. 400 సీట్లు దాటాలి అంటే దక్షిణాదిలో ఎన్ని సీట్లు గెలవాలనే దానిపై బీజేపీ నేతలు వివరించారు. తెలంగాణలో 10కి పైగా లోక్‌సభ(Telangana Lokh Sabha Election 2024)) స్థానాలు గెలిస్తేనే టార్గెట్ రీచ్ అవుతామని వారికి బీజేపీ స్పష్టం చేసింది. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ బీజేపీ ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉందని తెలిపింది.
KTR fires on Revanthreddy : 'రేవంత్ రెడ్డి.. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ మనిషి'