RP Sisodia Inquiry Into Govt Land Grabs in Visakha:వైఎస్సార్సీపీ హయాంలో వేల ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందనే ఆరోపణల వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా విశాఖలో పర్యటించారు. ముందుగా మధురవాడ ప్రాంతంలోని హయగ్రీవ, రామానాయుడు స్టూడియో భూములను సిసోదియా పరిశీలించారు. కలెక్టర్, ఆర్డీఓలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కట్టడాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ తర్వాత దసపల్లా భూములను పరిశీలిచంచారు. అనంతరం ఆనందపురం, భీమిలి మండలాల్లో అన్యాక్రాంతమైన భూములను సిసోదియా పరిశీలించారు.
విశాఖ జిల్లా భీమునిపట్నం బీచ్ ఎర్రమట్టి దిబ్బలలో భీమునిపట్నం మ్యూచువల్ లిమిటెట్ కో ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి, శారదా పీఠానికి కేటాయించిన భూములను కలెక్టర్ హరిప్రసాద్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్‌లతో సిసోదియా పరిశీలించారు. అనంతరం భీమునిపట్నం రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాల్లో 22-ఏ భూముల రికార్డులను, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. సబ్ రిజిస్ట్రార్ ఎం. గోపిచంద్‌ని అడిగి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వివరాలను తెలుసుకున్నారు. తర్వాత వైసీపీ హయాంలో జరిగిన కబ్జాలకు సంబంధించి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. విశాఖ నగరంలో క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సిసోదియా సమీక్ష నిర్వహించారు.
పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన ఆళ్ల నాని - Alla Nani Resign to YSRCP