ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో విమానాశ్రయం - డొమెస్టిక్​ టెర్మినల్​గా నిర్మాణం - CONSTRUCTION OF AIRPORT IN ONGOLE

ప్రకాశం జిల్లాలో విమానాశ్రయం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలం-రెండు దశాబ్దాలుగా ప్రతిపాదనలో ఉన్న విమానాశ్రయం కల సాకారం

AIRPORT IN PRAKASAM DISTRICT
AIRPORT IN PRAKASAM DISTRICT (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 24, 2025, 10:29 AM IST

Airport In prakasam District: రాష్ట్రంలో నూతనంగా ఐదు విమానాశ్రయాలను ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో ప్రకాశం జిల్లాకు ఒక విమానాశ్రయం మంజూరు కానుంది. దీనిపై అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు పూర్తి స్తాయిలో దృష్టిపెట్టారు. డొమెస్టిక్‌ టెర్మినల్‌గా చిన్న విమానాలు దిగేందుకు అనువుగా ఇక్కడ ఎయిర్‌పోర్టును నిర్మించాలనే ప్రతిపాదన వచ్చింది. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రతిపాదన ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో అడుగు ముందుకు పడుతుంది.

ప్రకాశం జిల్లాలో ఎయిర్​పోర్టు: ప్రకాశం జిల్లాలో విమానాశ్రయం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. కేంద్ర పౌర విమానాయన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్​రావు సైతం రాష్ట్రంలో ఐదు విమానాశ్రమాల ఏర్పాటుకు అంగీకరించారు. దీంతో దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రతిపాదనలో ఉన్న విమానాశ్రయం కల నెరవేరనుంది. ఈ ఎయిర్ పోర్టు జిల్లా కేంద్రం ఒంగోలుకు అతి సమీపంలో ఉన్న కొప్పోలు, ఆలూరు, అల్లూరు తదితర ప్రాంతంలో ఉన్న స్థలంలో ఏర్పాటు చేసేందుకు ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు స్థలాన్ని పరిశీలించారు.అయితే ఈ స్థలం ఎంతవరకు అనుకూలమో సాంకేతిక పరిశీలన చేసిన తరువాతే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఒంగోలు ఎయిర్​పోర్టుకు అనుకూలం: వాణిజ్య పరంగా ప్రకాశం జిల్లాకు గుర్తింపు ఉంది. జిల్లాలో గ్రానైట్‌, పొగాకు వంటి అంతర్జాతీయ వ్యాపారాలు, ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగ, ఉపాధి పొందేవారు సంఖ్య గణనీయంగా ఉంది. దగ్గర్లో రామయ్యపట్నం పోర్టు నిర్మాణం జరుగుతుండటం, సముద్ర తీరం కూడా అతి సమీపంలో ఉండటం వంటి కారణాలు వల్ల ఒంగోలు అన్ని విధాలుగా అనుకూలమని ప్రజాప్రతినిధులు పట్టుమీద ఉన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఎయిర్‌ పోర్టు ఇక్కడే ఏర్పాటు చేయాలని పలుమార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పెద్దలను కలిసి విన్నపాలు అందించారు.

కొత్త ప్రతిపాదనల్లో 600 ఎకరాలు: ఈ ప్రాంతంలో వాన్‌పిక్‌కు చెందిన భూములు వేలల్లో ఉన్నాయి. 2009-10 సంవత్సరంలో ఈ భూముల్లో 3,150 ఎకరాలు ఎయిర్‌పోర్టు కోసం కేటాయించారు. ప్రకాశం ఎయిర్‌పోర్టు ప్రయివేట్‌ లిమిటెడ్‌ పేరుతో భూములను కేటాయించి సరిహద్దులు కూడా నిర్ణయించారు. 3వేల మీటర్ల మేర రన్‌వే నిర్మించే విధంగా అంత భూమిని కేటాయించారు. అయితే అప్పట్లో వాన్‌పిక్‌ పై భారీ స్థాయిలో వివాదాలు నెలకొనడంతో ఈ భూములు ఈడీ ఎటాచ్‌మెంట్‌లోకి వెళ్ళాయి. అయితే కొత్తప్రతిపాదన ప్రకారం సమారు 600 ఎకరాలుకు సరిపెట్టి చిన్న విమానాలు దిగే విధంగా ఎయిర్‌ పోర్ట్​ను నిర్మించనున్నారు.

నేల పటుత్వంపై చర్చ: ప్రతిపాదిత ప్రాంతంలో మధ్య నుంచి నల్లవాగు, పోతురాజు కాలువలు ప్రవహిస్తాయి. అందువల్ల ఈ వాగులను ఒక పక్కన ఉండే విధంగా విమానాశ్రయం స్థలాన్ని కొంచెం మార్పు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సమీపంలో కొండలు వంటివి లేకపోవడం కొంత సానుకూల అంశమే అయినప్పటికీ బాపట్ల జిల్లా సూర్యలంక ప్రాంతంలో ఆర్మీ ఫైరింగ్‌ జోన్‌గా ఉండటం వల్ల దీన్ని ఎలా అధిగమించాలనే దానిపై చర్చ సాగుతుంది. దాదాపు 70 నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల విమానాలు ల్యాండింగ్‌కు ఇబ్బంది ఉండకపోవచ్చని జిల్లా అధికారులు ఎయిర్‌పోర్టు అధికారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు నేల పటుత్వం పై సైతం చర్చ సాగుతుంది.

రన్​వే నిర్మాణం- అధిక వ్యయం: ప్రాంతంలో కొంత చౌడు భూములుండగా ఇటువంటి నేలలో రన్‌వే నిర్మించడం అధిక ఖర్చుతో కూడుకున్న అంశం. ఎయిర్‌ పోర్టు అధారిటీ బృందం సాంకేతికంగా అన్ని అంశాలను కూలంకుశంగా మదించి నివేదికలు తయారు చేస్తే గానీ విమానశ్రమం వ్యవహారం ఒక కొలిక్కి రాదు. భూములకు సంబంధించిన చిక్కుముడులు తొలగించి సాధ్యమైనంత వరకూ త్వరలో నిర్మాణానికి శ్రీకారం చుట్టే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రజా ప్రతినిధులు పేర్కొంటున్నారు. ప్రకాశం జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్ల కల నెరవేరే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.

''3వేల మీటర్ల మేర రన్‌వే నిర్మించే విధంగా అంత భూమిని కేటాయించారు. అయితే అప్పట్లో వాన్‌పిక్‌ పై భారీ స్థాయిలో వివాదాలు నెలకొనడంతో, ఈ భూములు ఈడి ఎటాచ్‌మెంట్‌లోకి వెళ్ళాయి. అయితే కొత్త ప్రతిపాదన ప్రకారం సమారు 600 ఎకరాలు వరకూ సరిపెట్టి చిన్న విమానాలు దిగే విధంగా ఎయిర్‌ పోర్ట్‌ను నిర్మించనున్నారు''-మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు ఎంపీ

'దిల్లీ-హైదరాబాద్‌' విస్తారా విమానం దారి మళ్లింపు - ఎయిర్​పోర్టులో విస్తృత తనిఖీలు

'విశాఖ- ముంబై' విమానానికి బాంబు బెదిరింపు - వెనక్కి రప్పించిన సిబ్బంది

అతడి లగేజీపై డౌట్​.. చెక్​ చేస్తే 47 కొండచిలువలు.. ఎయిర్​పోర్ట్​ అధికారులు షాక్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.