ETV Bharat / state

జీవీ రెడ్డి రాజీనామాకు ఏపీ ప్రభుత్వం ఆమోదం - ఎండీను బదిలీ చేస్తూ ఉత్తర్వులు - GOVERNMENT ON GV REDDY RESIGNATION

ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవికి జీవీరెడ్డి చేసిన రాజీనామాకు ప్రభుత్వం ఆమోదం - ఫైబర్‌నెట్‌లో వివాదంపై సీఎం చంద్రబాబు వద్దకు చేరిన నివేదిక - ఫైబర్‌నెట్ ఎండీ దినేష్‌కుమార్‌ను బదిలీ చేస్తూ నిర్ణయం

Government Accepts Fibernet Chairman GV Reddy Resignation
Government Accepts Fibernet Chairman GV Reddy Resignation (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 24, 2025, 9:34 PM IST

Government Accepts Fibernet Chairman GV Reddy Resignation : ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి చేసిన రాజీనామాకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరోవైపు ఫైబర్ నెట్​లో వివాదంపై నివేదిక సీఎం వద్దకు చేరింది. ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్​ను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దినేష్ కుమార్​ను జీఎడీకీ రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు చర్యల ద్వారా అటు పార్టీలో అయినా, ఇటు ప్రభుత్వంలో అయినా క్రమశిక్షణకు ప్రాధాన్యం అనే నిర్థిష్ట అభిప్రాయాన్ని ప్రభుత్వ పెద్దలు వ్యక్తం చేసినట్లు అయ్యింది.

న్యాయవాద వృత్తిలో కొనసాగుతా : ఏపీ ఫైబర్‌ నెట్‌ ఛైర్మన్‌ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో పదవులకు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. తనపై ఉంచిన విశ్వాసానికి, అందించిన మద్దతుకు, కీలక బాధ్యతలను నిర్వహించే అవకాశం కల్పించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ మరింత బలంగా ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షిస్తున్నట్లు లేఖలో జీవీ రెడ్డి చెప్పారు. ఇకపై పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని లేఖలో పేర్కొన్నారు.

వసూళ్లు ఎన్ని? ఖర్చు ఎంత ? ఏపీఎస్​ఎఫ్​ఎల్​లో మొదలైన ఆడిట్​ - FIBERNET SCAM

ఏపీలో భారత్‌ నెట్ ప్రాజెక్టు విస్తృతికి వేగంగా అడుగులు - కేంద్రమంత్రికి నివేదిక అందజేత - BharatNet Project Expansion in AP

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.