Kakinada News Today: చేతిరాతతోనూ రికార్డులు సాధించవచ్చని ఆదిత్య పాఠశాలల విద్యార్థులు నిరూపించారు. నేతాజీ సుభాశ్ చంద్రబోస్ జయంతి, జాతీయ చేతిరాత దినోత్సవం సందర్భంగా కాకినాడ జేఎన్‌టీయూకే ప్రాంగణంలో గురువారం ఈ విద్యార్థులతో చేతి రాత (హ్యాండ్ రైటింగ్) మారథాన్ జరిగింది. 2,200 మందికి పైగా విద్యార్థులు చంద్రబోస్ జీవిత చరిత్రను నిర్దేశించిన అయిదు నిమిషాల్లో రాశారు. ఆదిత్య విద్యాసంస్థల ఛైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి సమక్షంలో డైరెక్టర్ ఎన్.శృతిరెడ్డి అధ్యక్షతన, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎగ్జిక్యూటివ్ దిలీప్ పాత్రో, సద్గురు అకాడమీ ఛైర్మన్ మహాలక్ష్మి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. మూడో అదనపు జిల్లా జడ్జి పి.కమలాదేవి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలతో దేశభక్తి స్ఫూర్తి పెరుగుతుందన్నారు.ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు కల్పించినట్లు దిలీప్ పాత్రో ప్రకటించారు. జేఎన్‌టీయూకే ఇన్‌ఛార్జి వీసీ మురళీకృష్ణ, గాయకుడు యశస్వి హాజరయ్యారు.
కాకినాడ సెజ్‌లో జేగ్యాంగ్ దోపిడీ - రైతుల భూములు లాక్కున్న దాడిశెట్టి రాజా
జగన్ మరో దాష్టీకం వెలుగులోకి - రాక్షస రాజకీయంతో కాకినాడ పోర్టు అరబిందో పరం!