Government Offers Incentives to Those Who Invest in Drone City : కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ప్రతిపాదించిన డ్రోన్ సిటీలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తుందని ఏపీ డ్రోన్ కార్పొరేషన్ సీఎండీ దినేష్‌కుమార్ పేర్కొన్నారు. అక్కడ దేశంలోనే మొదటి డ్రోన్‌సిటీని 300 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో విజయవాడలో గురువారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్రోన్ తయారీ, సేవలు, విడిభాగాల యూనిట్లు ఒకే చోట ఉండేలా సిటీని అభివృద్ధి చేస్తామని తెలిపారు.
సుమారు 40 వేల మందికి ఉపాధి కల్పించాలన్నది లక్ష్యమని తెలిపారు. ఓర్వకల్లులో అతిపెద్ద కామన్ టెస్టింగ్ ఫెసిలిటీని కల్పిస్తామన్నారు. చైనా, బెల్జియం, అమెరికా వంటి దేశాలకు దీటుగా ఇక్కడ పరిశ్రమలను ప్రోత్సహిస్తామని వెల్లడించారు. యూనిట్లు ఏర్పాటు చేసేవారికి భూములను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లోని విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నాం. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మానుఫ్యాక్చరింగ్ సంస్థల భాగస్వామ్యంతో ఇప్పటికే శిక్షణ ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ ముఖ్య ఇంజనీర్ నాగభూషణం పాల్గొన్నారు.
ఓర్వకల్లులో 'డ్రోన్ సిటీ" - 35 వేలమందికి ఉపాధి
డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం - 1000 కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యం