Road Accident in Srikakulam District Due To Over Speed : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంచిలి మండలం జక్కర సమీపంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. విశాఖ నుంచి ఒరిస్సా వైపు వెళ్తున్న కారు ఓవర్ స్పీడ్‌తో వెళ్తూ కరెంట్ పోల్‌ను ఢీ కొట్టడంతో కారు నుజ్జునుజ్జై పోయింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
మరో ఇద్దరిని సోంపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. క్షతగాత్రులు సోంపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులు సోమేశ్వరరావు, లావణ్య, స్నేహ గుప్తా విశాఖపట్నం సీతమ్మధారకు చెందిన వారిగా గుర్తించారు. ఒడిశాలోని జాజిపూర్ అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.