Lychee Fruit Benefits :ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మోకాళ్ల నొప్పులతో అవస్థలు పడుతున్నారు. అంతేనా.. వయసులో ఉండగానే.. కీళ్లు, ఎముకల నొప్పుల బాధలు వేధిస్తున్నాయి. ఇలాంటి దీర్ఘకాలిక రోగాలన్నింటిని.. రోడ్డుపక్కన ఉండే పండు ఒకే ఒక్క పండు తగ్గిస్తుందని చెబుతున్నారు నిపుణులు! మరి.. ఆ పండు ఏది? దానివల్ల ఇంకా ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.
పండు చిన్నదే ప్రయోజనాలు అనేకం - ఈ విషయాలు తెలిస్తే అస్సలు వదలరు - CARISSA CARANDAS
- లిచీ పండ్లు శరీరంలోని ఫ్రీరాడికల్స్ ప్రభావాన్ని తగ్గించడంతో పాటు రొమ్ము క్యాన్సర్ బారినపడకుండా సహకరిస్తుంది.
- విటమిన్-బి6, విటమిన్-సి, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, ఐరన్, ఫాస్సరస్, ఫైబర్ అధికంగా ఉంటాయి.
- లిచీ పండ్లు జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. తద్వారా జీర్ణప్రక్రియ సాఫీగా సాగేలా ఉపయోగపడతాయి.
- విటమిన్-సి ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు అతిసార, కలరా, టైఫాయిడ్ లాంటి అంటువ్యాధుల బారినపడకుండా సంరక్షిస్తుంది.
- రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.
- ఎముక దృఢత్వానికి దోహదపడే మెగ్నీషియం, ఫాస్పరస్ ఈ పండ్లలో లభిస్తాయి. దీంతో వృద్ధాప్యంలో ఎముకలు పెళుసు బారకుండా, మోకాళ్ల నొప్పులూ, కాళ్లు, కీళ్ల నొప్పుల బారిన పడకుండా మేలు చేస్తాయి.
- ఇనుము, కాపర్ ఖనిజాలు ఉండటం వల్ల ఎర్రరక్త కణాలు వృద్ధి చెందుతాయి. రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచి రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది.
- లిచీ పండ్లు పిల్లల ఎదుగుదలకు దోహదపడతాయి. హై బీపీతో బాధపడే వారు లిచీ పండ్లను తినడం మంచిదే. ఇందులో పొటాషియం అధికంగా ఉండటం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.
షుగర్ బాధితులు పాలు తాగొచ్చా? - పరిశోధనలో కీలక విషయాలు! - Can Diabetics Drink Milk
- పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారించడంతో పాటు మధుమేహులకు ఇవి వరం అని చెప్పుకోవచ్చు.
- వైరస్లు శరీరంలోకి ప్రవేశించకుండా వాటి వృద్ధినీ అడ్డుకునే లక్షణాలు లిచీ పండ్ల ప్రత్యేకం.
- ముఖం, శరీరం మీద ముడతలు రాకుండా వృద్ధాప్యాన్ని వాయిదా వేసుకునేలా లిచీ పండ్లు ఉపయోగపడతాయి.
- ఉబ్బసం, ఆస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు, అధిక బరువుతో బాధపడే వారికి లిచీ మంచిదే.
- లిచీలో అధికంగా ఉండే పాలిపినాల్స్ గుండెను ఆరోగ్యం ఉంచడంతోపాటు క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా అరికడతాయి.
- తెల్ల రక్త కణాల పనితీరును మెరుగు పరచడంతో పాటు శరీరంలోని బాక్టీరియాలు, వైరస్‌లను నాశనం చేస్తుంది.
- లిచీ పండ్లు తినడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యను అడ్డుకోవచ్చు. విటమిన్-C ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తుంది.