తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రభాస్ పంపిన బాహుబలి భోజనం బకాసురుడిలా తిని, కుంభకర్ణుడిలా పడుకున్నా' - ACTOR JAGAPATHI BABU IN BHIMAVARAM

వివాహ భోజనంబు వింతైన వంటకంబు అంటూ వీడియో షేర్​ చేసిన జగపతిబాబు - భీమవరంలో షూటింగ్​ జరుగుతుండగా భోజనం పంపిన రెబల్​ స్టార్​

ACTOR JAGAPATHI BABU IN BHIMAVARAM
PRABHAS SENT THE FOOD TO JAGAPATHI (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 10, 2024, 5:36 PM IST

Jagapathi Babu in Bhimavaram: రెబల్ స్టార్ ప్రభాస్ నటినటులకు భోజనం పంపిస్తాడని కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు, పాన్ ఇండియా లెవల్​లో ప్రతి ఒక్కరూ ఈ విషయం గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. తాజాగా ఆ లిస్ట్​లో నటుడు జగపతి బాబు కూడా చేరిపోయారు. తాజాగా ఆయన తన 'ఎక్స్' ఖాతాలో ఓ వీడియో షేర్ చేశారు. అందులో చాలా రకాల ఫుడ్ ఐటమ్స్​ ఉన్నాయి. వాటిని బకాసురుడిలా తిని, కుంభకర్ణుడిలా పడుకున్నానంటూ జగపతి బాబు హస్యస్పదంగా తెలిపారు.

ప్రభాస్ ఫుడ్​తో ఈ బాబు బలి : ఆ వీడియోలో 'వివాహ భోజనంబు వింతైన వంటకంబు, వియ్యాలవారి విందు ఓ హో హో నాకే ముందు' అంటూ ఆ వాతావరణానికి సెట్ అయ్యేలా పాటను యాడ్ చేశారు. అంతే కాకుండా ప్రభాస్ గురించి కొన్ని ఫన్నీ కామెంట్స్​ను రాసుకొచ్చారు. ఇది ప్రభాస్ ప్రమేయం లేకుండా జరిగిందని, దీని గురించి చెప్పొద్దని అన్నారు. ఎందుకంటే ఎవరైనా చెప్తే తను పెట్టే ఫుడ్​తో ఈ బాబు బలి అంటూ సరదాగా వ్యాఖ్యల్నీ జోడించారు. అదీ బాహుబలి లెవల్ అంటూ ప్రశంసించారు.

భీమవరం రాజులకు జై : భీమవరం రాజులను స్టైల్​ను జగపతి బాబు గుర్తు చేసుకున్నారు. రాజులు పెట్టిన భోజనం తిన్నాక వారిని కొనియాడకుండా ఎవరైనా ఉంటారా చెప్పండి. జై భీమవరం, జై రాజులు, జై బాహుబలి, జై ప్రభాస్ అంటూ జగపతి బాబు మురిసిపోయారు. ఇంతకీ ఆయన భీమవరం ఎందుకు ఉన్నారంటారా? ఓ మూవీ షూటింగ్ కోసం అని చెప్పారు. ప్రభాస్​తో కలిసి జగపతి బాబు చేసిన సలార్ బాక్స్​ఆఫీస్​ను షేక్​ చేసింది. సలార్ సినిమాలో జగపతి బాబు వరదరాజు రాజమన్నార్ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు కూడా పొందారు.

ఫ్యాన్స్​ కొటేషన్స్​ : జగ్గుబాయ్ వీడియో చూసి చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్, నెటిజన్స్ స్పందిస్తున్నారు. ఇలాంటివి చూసినప్పుడే "ప్రభాస్ ఫ్రెండ్ లిస్టులో నేను ఎందుకు లేనా అని అనిపిస్తుంటుంది" అంటూ ఒకరు కామెంట్స్ చేస్తే... "ఎవరైనా కొట్టి చంపేస్తారు, ఈయన ఏంటీ పెట్టి చంపేలా ఉన్నాడు" అంటూ మరొకరు మీమ్స్​ క్రియేట్ చేసి సామాజిక మాధ్యమంలో ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.

'రాజా సాబ్' స్పెషల్ సాంగ్! - 17 ఏళ్ల తర్వాత ఆ స్టార్ హీరోయిన్​తో ప్రభాస్ స్టెప్పులు!

బర్త్​​డే రోజు జగ్గు భాయ్​ ఫన్నీ క్వశ్చన్- ఆ విషయంలో ఫ్యాన్స్​ సజెషన్​!

ABOUT THE AUTHOR

...view details