Real Estate Dealers Selling Govt Assigned Lands: ఆదిలాబాద్ జిల్లాలో స్థిరాస్తి వ్యాపారులు ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైంది. ఇక్కడ ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో పాగావేసే దందా సాగుతోంది. అందివచ్చిన అవకాశాలను అనుకూలంగా మార్చుకొని అమాయకులకు టోపీపెట్టే తతంగం కొనసాగుతోంది. తద్వారా కోట్ల విలువచేసే భూమలను కొట్టేస్తున్నా అధికారయంత్రాంగం మొద్దు నిద్రపోతుంది.
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆదిలాబాద్, బట్టిసావర్గాం, మావల శివారు ప్రాంతాల్లోని 131, 49,170 సర్వేనెంబర్లలో ఉన్న వందల ఎకరాల ప్రభుత్వ భూముల లెక్కాపత్రం లేకుండా పోతోంది. వాస్తవంగా 1958 కంటే ముందు నుంచి ఇప్పటికీ కాస్తులో ఉండీ, సాగుచేసుకుంటుంటే ప్రభుత్వం కేటాయించిన భూములకు ప్రభుత్వం జీవో నెంబర్ 1406 ప్రకారం నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) జారీచేస్తోంది.
ఈ నిబంధనలకు లోబడి జిల్లాల పునర్విభజకంటే ముందు కొంత మంది అధికారులు జారీచేసిన ఎన్‌వోసీల్లో ఏవీ అసలైనవో ? ఏవీ నకిలీవో ? తెలియటంలేదు. ఒక్కో సర్వేనంబర్ లో భూముల కోసం బైనంబర్లు వేసుకుంటే ఇద్దరు, ముగ్గురేసి వ్యక్తులు దస్త్రాలతో అనధికారికి విక్రయాలు చేసే దందా సాగుతోంది. ఫలితంతా అసలైన అసైన్డ్‌దారులు ఎవరనేది తెలియక వివాదస్పదమవుతోంది.
villagers reunion: ఆ ఊరు మళ్లీ అందరిని కలిపింది..
ఆదిలాబాద్, బట్టిసావర్గాం, మావల శివారులో రూ. కోట్ల విలువ చేసే కొన్ని లేఅవుట్ల క్రయవిక్రయాల వెనక రాజకీయ మద్దతు కలిగిన కొంతమంది బడాబాబుల హస్తం ఉంది. సర్వేనెంబర్ల వారీగా ఆరాతీస్తే అక్రమార్కుల భాగోతం వెల్లడయ్యే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో ఏ సర్వేనంబర్ భూమి ఎక్కడ ఉందో.? అందులో ఎన్ని భాగాలయ్యాయో ? తేలాలంటే సబ్‌డివిజన్ చేస్తే తప్పితే అయ్యే అవకాశమేలేదు.
దానికోసం గతంలో కేసీఆర్ ప్రభుత్వం కొంత చొరవచూపినప్పటికీ, ఆతర్వాత తేనెతుట్టెని తాకినట్లు ఉంటుందనే ఆలోచనతో మానుకుంది. ఆ వెసలుబాటే, కొంతమంది అధికారులు, మరికొంత నాయకులకు రూ. లక్షలు సంపాదించే పెట్టే ఆదాయవనరుగా మారింది. దానికి స్థిరాస్తి వ్యాపారమన్నట్లు చలామణి అవుతోంది. పేదల ఇళ్లస్థలాలకోసం గుంట భూమి లభించడం లేదు కానీ, స్థిరాస్తివ్యాపారులకు ఎకరాల కొద్ది లభిస్తుందంటే ప్రభుత్వ ఉదాసీనవైఖరే ప్రధాన కారణమనే అభిప్రాయం ప్రజాసంఘాల నుంచి వినిపిస్తుంది. అక్రమాలపై అధికారులను ప్రశ్నిస్తే వివాదాల కారణంగా కేసులు కోర్టుల్లో ఉన్నాయనే మాటలు వినిపిస్తున్నాయి.
'ఆదిలాబాద్, బట్టిసావర్గాం, మావల శివారులో రూ. కోట్ల విలువ చేసే కొన్ని లేఅవుట్ల క్రయవిక్రయాల వెనక రాజకీయ మద్దతు కలిగిన కొంతమంది బడాబాబుల హస్తం ఉంది. ఒకప్పుడు సాదాసీదాగా సాగిన భూముల క్రయవిక్రయాలు, ఇప్పుడు వివాదాస్పదం కావటానికి స్థిరాస్తి వ్యాపారుల ఆగడాలే ప్రధాన కారణం. ఈ అక్రమాల్లో వారికి ఉప్పందించే కొంతమంది అధికారుల పాత్ర కూడా ఉంది.'- కిరణ్, ఆదిలాబాద్ ప్రజాసంఘాల నేత
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పుంజుకుంది : సీఎం రేవంత్ రెడ్డి - CM Revanth On Hyderabad Real Estate