Rape On Tribal Woman In Sangareddy: మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆడవాళ్లు ఒంటరిగా కనిపిస్తే చాలు కొందరు మగాళ్లు మృగాళ్లలా మారిపోతున్నారు. వారిపై దౌర్జన్యాలకు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ నేరాలను అరికట్టేందుకు సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటున్నా, నేరాలు మాత్రం తగ్గడం లేదు.
మహిళపై అత్యాచారం : తాజాగా సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దైవ దర్శనానికి వెళ్లి వస్తూ మార్గమధ్యలో ఓ విద్యాపీఠం ఆవరణలో నిద్రించిన గిరిజన మహిళ (37)పై తమిళనాడుకు చెందిన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అడ్డుకోబోయిన ఆమె భర్తపై దాడి చేశాడు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం :మెదక్ జిల్లాకు చెందిన గిరిజన దంపతులు సంత్ సేవాలాల్ దర్శనానికి ఈ నెల 2న ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా నేరడిగొండకు పాదయాత్రగా తమ తండా నుంచి వెళ్లారు. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత గత శుక్రవారం (ఫిబ్రవరి 14) రాత్రి సంగారెడ్డి మండలం ఫసల్‌వాదికి చేరుకున్నారు. రాత్రి కావడంతో ఓ విద్యాపీఠంలో భోజనం చేసి ఆ ఆవరణలోని చెట్టుకింద నిద్రపోయారు. విద్యాపీఠంలో గుడి నిర్మిస్తుండగా పెయింటర్‌గా పని చేస్తున్న తమిళనాడులోని నాగపట్నం జిల్లాకు చెందిన మాథవన్ అనే యువకుడు నిద్రిస్తున్న మహిళపై కన్నేశాడు.