తెలంగాణ

telangana

తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు రామోజీ గ్రూపు రూ. 5 కోట్ల భారీ విరాళం - ప్రజల నుంచి విరాళాల ఆహ్వానం - Ramoji Group Donates for Flood

By ETV Bharat Telangana Team

Published : Sep 4, 2024, 9:41 PM IST

Updated : Sep 4, 2024, 10:14 PM IST

Ramoji Group donates Rs.5 crore to flood victims in Telugu states : ఎప్పుడు విపత్తులు, ఆపదలు తలెత్తినా ప్రజలకు అండగా నిలిచే రామోజీ గ్రూపు మరోసారి తన పెద్ద మనుసు చాటుకుంది. కుండపోత వర్షాలకు కకావికలమైన తెలుగు రాష్ట్రాల్లో బాధితుల సహాయార్థం 5 కోట్ల రూపాయలతో ఈనాడు సహాయ నిధిని ప్రకటించింది.

Ramoji Group Donates Rs.5 crore to Flood Victims
Ramoji Group Donation to flood victims (ETV Bharat)

Ramoji Group Donates Rs.5 crore to Flood Victims in Telugu States : ఎప్పుడు విపత్తులు, ఆపదలు తలెత్తినా ప్రజలకు అండగా నిలిచే రామోజీ గ్రూపు మరోసారి తన పెద్ద మనసు చాటుకుంది. కుండపోత వర్షాలకు కకావికలమైన తెలుగు రాష్ట్రాల్లో బాధితుల సహాయార్థం 5 కోట్ల రూపాయలతో ఈనాడు సహాయ నిధిని ప్రకటించింది. వరదలు ఇరు రాష్ట్రాల్లోనూ భారీ విధ్వంసం సృష్టించాయి. బాధితులు తమ ఇళ్లను, జీవనోపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు.

ప్రకృతి ప్రకోపంతో తలెత్తిన ఈ భయానక పరిస్థితుల్లో బాధితులకు ప్రజలంతా కలిసి అండగా నిలవడం, సామాజిక బాధ్యతని రామోజీ గ్రూపు పిలుపునిచ్చింది. ఈనాడు సహాయ నిధిని బాధితుల తక్షణ సహాయ చర్యలకు కేటాయించినట్లు పేర్కొంది. తీవ్రంగా ప్రభావితమైన వారికి సాయం అందించడం కేవలం మద్దతే కాదని ఈ చీకటి సమయంలో వెలుగు నింపుతుందని రామోజీ గ్రూపు పేర్కొంది. బాధితులకు సాయం చేసేందుకు ప్రతి ఒక్కరూ ఈనాడుతో చేతులు కలపాలని కోరింది. వరద బాధితులకు సాయం చేయాలనుకునేవారు ఈనాడు రిలీఫ్ ఫండ్‌ యూనియన్ బ్యాంక్‌ ఖాతా నంబరు 370602010006658కు పంపాలని కోరింది.

ఈనాడు రిలీఫ్‌ ఫండ్‌ వివరాలివే

  • Eenadu Relief Fund
  • Union Bank of India, Saifabad Branch
  • SB A/c no. 370602010006658
  • IFSC Code: UBIN0537063

ఆపద సమయంలో బాధితులకు అండగా రామోజీ గ్రూప్​ - ఆపన్నహస్తంతో ఎన్నో కార్యక్రమాలు - Ramoji Rao Group Relief Funds

Last Updated : Sep 4, 2024, 10:14 PM IST

ABOUT THE AUTHOR

...view details