Ramoji Dolphin Hotels :సువిశాల రామోజీ ఫిలిం సిటీలో డాల్ఫిన్ గ్రూపు రెండు ప్రతిష్టాత్మక హోటళ్లను నిర్మించింది. అవే తార, సితార. ఆధునిక సదుపాయాలతో దేశ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకునే ఈ స్టార్ హోటళ్లు సౌకర్యవంతమైన వసతులకు పేరు పడ్డాయి. రామోజీరావు అసమాన కృషితో తయారైన డాల్ఫిన్ హోటళ్లు ఫిలిం సిటీలో ఏటా జరిగే వందలాది కార్పొరేట్ సదస్సులకు హాజరయ్యే ప్రముఖులకు బస సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఫిలింసిటీలో 2002లో జరిగిన ప్రపంచ చదరంగ పోటీలకు హాజరైన దేశ, విదేశీ ప్రములందరికీ ఆతిథ్య సేవలందించిన కేంద్రాలివే. అదే సంవత్సరం జరిగిన నేషనల్ గేమ్స్‌కు ఆధికారిక ఆతిథ్య సంస్థగా క్రీడాకారులందరికీ డాల్ఫిన్ భోజన సదుపాయాలు కల్పించింది.
సితార థీమ్స్, రాయల్ స్వీట్స్ ప్రత్యేక ఆకర్షణ. ఆమ్రపాలి, క్లియోపాత్రా, మొఘల్-ఎ-ఆజమ్ థీమ్స్ స్వీట్స్ ఆయా సంస్కృతులకు అద్దం పడతాయి. బోబ్రా ది గ్రీక్, ఎంటర్ ది డ్రాగన్ రాయల్ స్వీట్స్ గ్రీస్, చైనా దేశాల అంలకరణలతో అలరిస్తాయి. ఇంకా ఈతకొలను, టెన్నిస్, బాస్కెట్ బాల్, స్క్వాష్ లాంటి క్రీడల కోసం కోర్టలు, విస్తృమైన గ్రంథాలయం, హెల్త్ క్లబ్, యోగా సెంటర్‌లతో సకల సౌకర్యాలను ఒకచోట అందిస్తున్నారు. ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు అధికారిక సమావేశాలను, కాన్ఫరెన్సులను, సెమినార్లను నిర్వహించుకోవడానికి ఈ సౌకర్యాలు అనువుగా ఉంటాయి. అప్పటికప్పుడు వచ్చినా నేరుగా సమావేశాల్లో పాల్గొనడానికి వీలుగా ఏర్పాట్లు ఉండటం విశేషం. రామోజీరావు దూరదృష్టితో ఫిలిం సిటీలో డాల్ఫిన్ శ్రేణిలోనే సహారా, శాంతినికేతన్ హోటళ్లు కూడా నిర్మించారు. ఫిలిం సిటీకి వచ్చే సినీరంగ ప్రముఖుల నుంచి లైట్ బాయ్స్ వరకు పలు రకాల వసతి ఏర్పాట్లను ఇవి అందిస్తాయి. వేర్వేరు స్థాయిల్లో ఏర్పాట్లు ఉండటం వల్ల సినీ నిర్మాతకు ఎంతో వ్యయం కలిసి వస్తుంది.
రైతుబిడ్డగా మొదలై మీడియా మహాసామ్రాజాన్ని నిర్మించిన యోధుడు రామోజీ రావు - Ramoji Rao Biography