Ramadan 2024 Boosts Dry Fruit Sale in Hyderabad : రంజాన్ మాసం వేళ హైదరాబాద్‌లోనిప్రధాన మార్కెట్లుజనసంద్రంగా మారాయి. కఠిన ఉపవాస దీక్షలు చేసే ముస్లింల కోసం దుకాణాల్లో వివిధ రకాల ఎండు ఫలాలు అందుబాటులో ఉన్నాయి. దేశ, విదేశాల నుంచి బాదం, జీడిపప్పు, కిస్మిస్, ఖర్జూర పండ్లు నగరానికి దిగుమతి అయ్యాయి. ఉపవాస దీక్షలు విరమించే ఇఫ్తార్ సమయంలో ముస్లింలు వివిధ రకాల ఎండు ఫలాలను స్వీకరిస్తారు. శరీరానికి శక్తినిచ్చే ఖర్జూరాలకు అధిక ప్రధాన్యం ఇస్తారు. ఒక్క ఖర్జూర పండులోనే 40 రకాల ఫలాలు దుకాణాల్లో కొలువుతీరాయి. సౌదీ అరేబియా, దుబాయ్, సూడాన్, ఇరాన్, తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఖర్జూరాలు అందుబాటులో ఉన్నాయి.
రంజాన్ మాసంలో ఖర్జూరాలకు మంచి డిమాండ్ ఉంటుంది. అల్లాహ్ దైవ దూతైన మహమ్మద్ ప్రవక్త ఖర్జూరాలను తీసుకుని తన ఉపవాస దీక్షను విరమించేవాడని అప్పటి నుంచి అదే అనవాయితీగా వస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటు ఈ ఖర్జూరాల్లో పీచు అధికంగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఉపవాసంలో కలిగిన బలహీనత తీరి వెంటనే శక్తిని పుంజుకునే అవకాశం ఉంటుంది.
"రంజాన్ సీజన్లో కర్జూరతో పాటు డ్రై ఫ్రూట్స్‌కి బాగా డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా కర్జూర్ ఫలాలు బాగా అమ్ముడు పోతాయి. రంజాన్ సీజన్లో అందరు ఉపావాసం ఉంటారు అందువల్ల కర్జూర ఫలాలు అధికంగా అమ్ముడు పోతాయి. ఒక సంవత్సరం కర్జూరలో ఎంత అమ్ముడు పోతాయి, రంజాన్ ఒక నెలలో అంత సేల్ ఉంటుంది. రంజాన్ ఇంకా పది రోజులు ఉంటుంది అనగా డ్రై ఫ్రూట్స్‌కు బాగా గిరాకీ ఉంటుంది. షీర్ కుర్మా చేయడానికి, వాళ్లు ఉపావాసం విరమించేటప్పుడు డ్రైఫ్రూట్స్‌కు ప్రాధన్యత ఇస్తారు. అందుకే వాటికి డిమాండ్ బాగా ఉంటుంది." - విక్రయదారులు