తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాజ్‌ లేని లైఫ్​​ నాకొద్దు - నేను వెళ్లిపోతున్నా' - తన అడ్వొకేట్​కు లావణ్య సందేశం - Raj Tarun Case Updates - RAJ TARUN CASE UPDATES

Raj Tarun Case Updates : రాజ్‌ లేని లైఫ్‌లో తాను ఉండలేనని, ఆత్మహత్య చేసుకుంటున్నానని నటి లావణ్య శుక్రవారం అర్ధరాత్రి తన లాయర్​కు సందేశం పంపింది. వెంటనే స్పందించిన ఆయన, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెళ్లి లావణ్యకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

Raj Tarun Lover Lavanya Suicide Message To Her Lawyer
Raj Tarun Lover Lavanya Suicide Message To Her Lawyer (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 13, 2024, 9:20 AM IST

Raj Tarun Lover Lavanya Suicide Message To Her Lawyer :రాజ్ లేని లైఫ్‌లో నేను ఉండలేనని, ఆత్మహత్య చేసుకుంటున్నానని నటి లావణ్య శుక్రవారం అర్ధరాత్రి తన లాయర్‌కు సందేశం పంపింది. 'రాజ్ లేని లైఫ్‌లో నేను ఉండలేను, బ్రతకలేను. అన్నీ కోల్పోయాను. అందరి వల్ల మోసపోయాను. నేనేంటో తెలిసిన వారే నన్ను తప్పుబట్టారు. రాజ్‌ తల్లిదండ్రులు నా చావుకు కారణం. రాజ్‌ మొత్తం మారిపోయాడు. నా చావును కోరుకున్నాడు. మాల్వీ మల్హోత్రా నా చావుకు ప్రధాన కారణం. నా కుటుంబం, లాయర్ దిలీప్‌ సుంకర, మీడియాకు నా క్షమాపణలు' అంటూ లావణ్య తన లాయర్‌కు పంపిన సందేశంలో పేర్కొంది.

వెంటనే స్పందించిన లావణ్య లాయర్ నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హుటాహుటిన లావణ్య ఇంటికి వెళ్లి, ఆమెకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. కాగా రాజ్‌ తరణ్‌ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. లావణ్య ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు రాజ్ తరుణ్​తో పాటు హీరోయిన్​ మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్ మల్హోత్రాపై కూడా కేసు నమోదు చేశారు. ఏ1గా రాజ్‌తరుణ్, ఏ2గా మాల్వీ, ఏ3గా మయాంక్‌లను చేర్చారు.

రాజ్​తరుణ్​కు రూ.70 లక్షలిచ్చా : టాలీవుడ్ నటుడు రాజ్​ తరుణ్​-లావణ్యల ప్రేమ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ యంగ్ నటుడిపై తీవ్ర ఆరోపణలు చేసిన నటి లావణ్య, ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసింది. తన కుటుంబం రాజ్ తరుణ్​కు రూ.70 లక్షలు ఇచ్చిందని చెప్పింది. తనకు అబార్షన్ కూడా చేయించాడని ఆరోపించింది. "2008 నుంచి రాజ్​తో నాకు పరిచయం ఉంది. 2010లో నాకు ప్రపోజ్​ చేసి, 2014లో పెళ్లి చేసుకున్నాడు. రాజ్​ తరుణ్​కు మా కుటుంబం రూ.70 లక్షలు ఇచ్చింది. 2016లో తాను గర్భం దాల్చితే రాజ్‌తరుణ్‌ అబార్షన్‌ చేయించాడు. మాల్వీ పరిచయం అయ్యాకే రాజ్‌ నా నుంచి దూరమయ్యాడు. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే మాల్వీతో పాటు ఆమె సోదరుడు మయాంక్‌ నన్ను బెదిరించారు." అని లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details