Raipur Village People Problems In Adilabad: పురుటినొప్పులను పంటి బిగువున ఓర్చుకొని పండంటి బిడ్డకు జన్మనిస్తే ఇల్లంతా పండగే. అలాంటిది ఆ తండాల్లోని గర్భిణీలకు నెలలు దగ్గర పడుతుంటే చాలు భయం వెంటాడుతోంది. ఎందుకంటే రోడ్డు సౌకర్యం సరిగ్గా ఉండదు. బస్సుల రాకపోకలు అసలే లేవు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌ల జాడే ఉండదు. దేవుడిపై భారం వెయ్యడం తప్పా ఏం చేయలేని నిస్సాహయస్థితి వారిది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో నేటికీ ఈ దయనీయ పరిస్థితి వెంటాడుతోంది.
A Tribal Man Death In Adilabad :రాయ్‌పూర్ తండాకు చెందిన 40 ఏళ్ల గిరిజన యువకుడు ఇందల్‌సింగ్ రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఆదిలాబాద్ రిమ్స్‌లో చేరగా పరిస్థితి విషమించి కన్నుమూశాడు. మృతదేహాన్ని రోడ్డు సౌకర్యంలేని ఆ గ్రామనికి తరలించిన తీరు మారుమూల ప్రాంతాల దుస్థితిని వెల్లడిస్తోంది. వేసవి కాలాన్ని మినహాయిస్తే మిగతా అన్ని సమయాల్లో అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఎడ్లబండ్లను ఆశ్రయించటం తప్పా వారికి మరో మార్గమేలేదు.
'ఆ రాత్రి ఓ పీడకల - బతుకు జీవుడా అంటూ బయటపడ్డం - అది గుర్తొస్తే ఒళ్లు జలదరిస్తుంది' - ONE YEARR FOR BHUPALPALLY FLOODS
మృతదేహాన్ని ఎద్దుల బండిలో తరలింపు :ఇందల్ సింగ్ మృతదేహాన్ని ఆదిలాబాద్‌కు 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న గణేష్‌పూర్ వరకు అంబులెన్స్‌లో తీసుకొచ్చినప్పటికీ అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయ్‌పూర్ తండాకు తీసుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. చివరికి చేసేదేమి లేక వర్షంలోనే ఎద్దుల బండిపైనే మృతదేహాన్ని తరలించిన తీరు హృదయాలను కలచివేస్తోంది. పాలకులు ఎవరైనా తమ బతుకులు మాత్రం మారడంలేదని స్థానికులు అంటున్నారు. దశాబ్ధాలుగా తండావాసుల ధీనస్థితి ఎన్నికల వేల తెరపైకి వచ్చినా ఆపై మరుగున పడిపోతుంది. ఓట్లు వేయడానికి తప్పా తమ బాగోగులు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు పట్టడంలేదని ఆదివాసీలు వాపోతున్నారు.
గత ప్రభుత్వంలో అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన రోడ్డు వేయలేదని రాయ్‌పూర్ తండా ప్రజలు వాపోతున్నారు. తండాలో ఏదైనా ప్రమాదాలు జరిగితే రోడ్డు రవాణా ఉండదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా గిరిజన తండాలపై ప్రత్యేక దృష్టి పెట్టి తమ తండాకు రోడ్డు, మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
"ఈ గ్రామంలో రోడ్డు లేదు. ఏదైనా ప్రమాదం జరిగితే అంబులెన్స్ కూడా గ్రామంలోకి రాదు. డాక్టర్లు తండాలోకి రావట్లేదు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఎడ్లబండ్లను ఆశ్రయించటం తప్ప మరో మార్గం లేదు. వర్షాకాలంలో ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతుంది. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి మా తండాను ఆదుకోవాలి." -తండా ప్రజలు
'మా ఊరు రావాలంటే ఏరు దాటాల్సిందే - అందుకే మాకెవ్వరూ పిల్లనిస్తలేరు' - Gurramgadda Village Problems