తెలంగాణ

telangana

ETV Bharat / state

రెయిన్ అలర్ట్ : బంగాళాఖాతంలో అల్పపీడనం - తుపానుగా మారే ఛాన్స్ - రాబోయే 3 రోజుల్లో వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - రేపు వాయుగుండంగా మారే అవకాశం - రాబోయే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్​లోని కొన్నిచోట్ల తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

LOW PRESSURE IN THE BAY OF BENGAL
Rain Alert in Andhra Pradesh (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Rain Alert in Andhra Pradesh : బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా పయనిస్తూ సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాతి రెండు రోజుల్లో తమిళనాడు-శ్రీలంక తీరాల వైపు వెళ్లొచ్చని తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్​లోని కొన్నిచోట్ల తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బుధ, గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. అల్పపీడనం క్రమంగా తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని కొన్ని వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. తర్వాత అల్పపీడనంగా బలహీనపడి తమిళనాడులో తీరం దాటుతుందని తెలుస్తోంది.

మరోవైపు ఏపీలో తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్‌ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అన్ని ప్రాంతాల కలెక్టర్లకు ఆదేశాలు పంపించారు. వరి పంట కోతల సమయం కావడంతో ధాన్యం తడిచిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఇంకా వర్షాలకు రెండురోజుల సమయం ఉండటంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.

ABOUT THE AUTHOR

...view details