Rain Disaster People Struggle in Some Districts:శనివారం కురిసిన భారీ వర్షాలతో సత్యసాయి జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. కొత్తచెరువు - ధర్మవరం ప్రధాన రహదారిపై ఉన్న విద్యుత్ స్తంభం నేలకూలింది. ప్రధాన రహదారి పక్కనే విద్యుత్ స్తంభం నేలకూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లోచర్ల ప్రధాన రహదారి చెరువు కట్టపై ఉన్న భారీ వృక్షం నేలకూలడంతో రాత్రి నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వృక్షం నేలకూలడంతో కొత్తచెరువు నుంచి పెనుగొండకు వెళ్లే రహదారి పూర్తిగా స్తంభించిపోయింది. పెనుగొండ ప్రధాన రహదారి మార్గంలోని రైల్వే వంతెన మునిగిపోవడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ద్విచక్ర వాహనాలు, ఆటోలలో వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాష్ట్రంలో ఒక్కసారిగా మారిన వాతావరణం- పలు జిల్లాలో భారీ వర్షాలు - Heavy Rains in Andhra Pradesh
సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలో శనివారం రాత్రి ఉరుములు, మెరుపుల వర్షంతోపాటు గాలి ఉద్ధృతంగా వీచింది. దీంతో పలుచోట్ల వృక్షాలు, విద్యుత్తు స్తంబాలు కూలాయి. పట్టణంలోని వాసవీ నగర్లో వేపవృక్షం కూలి విద్యుత్తు స్తంభంపై పడటంతో నేలవాలింది. ఉరుములు, మెరుపులతోపాటు విద్యుత్తు తీగలతో నిప్పులు రేగటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చెట్టు కొమ్ములు, విద్యుత్తు తీగలు వీధిలో అడ్డంగా పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జోరువానకు డ్రైనేజీలు పొంగి రోడ్లపైకి వరద నీరు రావటంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.
రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు - ఎప్పుడంటే ! - South West Monsoon 2024