తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలింగ్ రోజున భారీ వర్షాలు - పార్టీల తలరాత మార్చనున్నాయా? - అభ్యర్థుల్లో టెన్షన్! - Rain Alert to Telangana on Poll Day - RAIN ALERT TO TELANGANA ON POLL DAY

Rain Alert to Telangana on Polling Day : లోక్​ సభ ఎన్నికల్లో గెలుపు బావుటా ఎగరేసేందుకు అభ్యర్థులంతా కాలికి బలపం కట్టుకొని తిరిగారు. ఇంకా తిరుగుతూనే ఉన్నారు. నెల రోజులుగా ఎండలో మాడిపోయారు.. తిండి, నిద్ర కూడా పట్టించుకోకుండా ప్రచారం చేసిన వాళ్లందర్నీ ఇప్పుడు ఒకే ఒక వార్త బెంబేలెత్తిస్తోంది. అదే పోలింగ్ రోజున వర్షం. మరి.. 13వ తేదీన ఏం జరగబోతోంది?

Rain Alert to Telangana on May 13th
Rain Alert to Telangana on Polling Day (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 9, 2024, 5:42 PM IST

Rain Alert to Telangana on May 13th :ఇప్పటి వరకూ.. రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ స్థానంలో ఏ అభ్యర్థికి గెలుపు అవకాశాలు ఉన్నాయి? అనే చర్చ సాగింది. అయితే.. ఇప్పుడు పోలింగ్ ఎంత శాతం నమోదవుతుంది? అనే చర్చ మొదలైంది. దీనికి కారణం పోలింగ్ రోజైన మే 13వ తేదీన తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడమే. మరి ఆ రోజున ఏం జరగనుంది?

వాతావరణ శాఖ ఏం చెబుతోంది?

లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections 2024) ప్రచారం కీలక దశకు చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆ పార్టీ ఈ పార్టీ అని తేడాలేకుండా అన్ని పార్టీల అభ్యర్థులూ శతవిధాలా ప్రయత్నించారు. దాదాపు నెల రోజులుగా జనంలోనే ఉన్నారు. తిండీ తిప్పలు మానేసి, ఎండను సైతం లెక్క చేయకుండా ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇలాంటి వారికి హైదరాబాద్ వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. పోలింగ్ రోజున రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. అంతేకాదు.. పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో.. అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది.

ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరిక..

రాష్ట్రంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరిక జారీచేసింది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరిక జారీచేసింది. ఈ జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది.

సమ్మర్ ఎఫెక్ట్ - రాష్ట్రంలో పోలింగ్ సమయాన్ని పొడిగించిన ఈసీ - Ec extend polling time

ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక..

రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీచేసింది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్​, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ జిల్లాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీచేసిన వాతావరణ శాఖ.. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రకటించింది. పలుచోట్ల వడగళ్ల వాన కూడా కురిసే అవకాశం ఉందని తెలిపింది.

అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్..

వాతావరణ శాఖ హెచ్చరికలతో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. సరిగ్గా పోలింగ్ రోజున వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. అసలే.. హైదరాబాద్ వంటి చోట్ల సాధారణ రోజుల్లోనే పోలింగ్ తక్కువగా నమోదవుతూ ఉంటుంది. అలాంటిది వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటని బెంబేలెత్తుతున్నారు. ఇన్నాళ్లూ పడిన కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుతుందా అని భయపడుతున్నారు. మరి.. ఏం జరుగుతుంది? వర్షం కురుస్తుందా? ఒకవేళ కురిస్తే ఓటర్లు ఏ విధంగా స్పందిస్తారు? అన్నది చూడాలి.

ఎన్నికలు పూర్తయ్యాకే డబ్బులు - రాష్ట్రంలో పథకాలపై ఈసీ నిర్ణయం - EC On Schemes Funds Release In AP

ABOUT THE AUTHOR

...view details