Radisson Hotel Drug Case Link With Goa :హైదరాబాద్ పంజాగుట్ట పరిధిలో కొద్ది రోజుల క్రితం సంచలనం సృష్టించిన స్టాన్లీ డ్రగ్స్ కేసులో సరఫరాదారుడిగా ఉన్న నైజీరియన్ ఓక్రా ప్రస్తుతం గోవాలోని కోల్వాలే జైలులో ఉన్నాడు. గోవాకు బిజినెస్ వీసాపై వచ్చిన ఓక్రా, డ్రగ్ వ్యాపారులతో సంబంధాలు పెంచుకుని అంతర్జాతీయంగా సరఫరా(International Drugs Supply) చేస్తున్నాడు. ఇదే క్రమంలో నెదర్లాండ్స్ నుంచి తెప్పించి, హైదరాబాద్‌లోని స్టాన్లీకి పంపించాడు.
Goa Drug Mafia Spreads in Telangana :పోలీసులకు చిక్కిన స్టాన్లీని విచారించగా ఇదంతా గోవా జైలు నుంచి ఓక్రా నడిపించినట్లు గుర్తించారు. ఇటీవల నగరంలో హాట్ టాపిక్‌గా మారిన రాడిసన్ డ్రగ్స్ కేసులో ప్రధాన సరఫరాదారుడిగా ఉన్న అబ్దుల్ కూడా కోల్వాలే జైల్‌లోనే ఉన్నట్లుగా ప్రాథమిక సమాచారం. రాడిసన్ డ్రగ్స్ కేసులో కొకైన్ వివేకానందకు చేరే ముందు పలు చేతులు మారింది. ఇప్పటికే గోవాలో విచారణ ఖైదీగా ఉన్న అబ్దుల్, రాణిగంజ్‌లో నివాసం ఉంటున్న అబ్దుల్ రెహ్మాన్‌కి డ్రగ్స్ పంపిణీ చేస్తున్నాడు.
అబ్దుల్ రెహ్మన్ నుంచి అత్తాపూర్‌లోని మీర్జాకీ, అక్కడ్నుంచి అబ్బాస్ అలీ ద్వారా వివేకా డ్రైవర్ ప్రవీణ్‌కు చేరాయి. గోవా జైలులోని ఖైదీలు హైదరాబాద్ కేంద్రంగా మాదక ద్రవ్యాలు సరఫరా(Drug Supply in Telangana) చేయడం ఆందోళనకరంగా మారింది. ఖైదీలు కేవలం ఫోన్ ద్వారా తమ నెట్‌వర్క్‌తో డ్రగ్స్‌ను పలు ప్రదేశాలకు పంపిస్తున్నారు.
మత్తు పదార్థాల కట్టడిపై సర్కార్ ఫోకస్ - రాష్ట్రంలో 'హుక్కా'ను నిషేధిస్తూ నిర్ణయం