మ్యాచ్‌కీ 3 గంటల ముందు నుంచి స్టేడియం లోపలికి అనుమతి : రాచకొండ సీపీ SRH vs MI IPL Match 2024 Hyderabad:బుధవారం రాత్రి హైదరాబాద్‌లో జరగబోయేముంబయి ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఐపీఎల్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. ఎస్ఆర్హెచ్(SRH) హోం గ్రౌండ్, ఉప్పల్ వేదికగా జరిగబోయే తొలి మ్యాచ్‌కు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు. స్టేడియం లోపలికి ఎలాంటి వస్తువులు తీసుకురావొద్దని, వాటర్ బాటిల్స్, బ్యానర్స్, ల్యాప్ ట్యాప్, లైటర్స్, సిగరెట్స్, బైనాక్యులర్స్‌పై నిషేధమని ఆయన స్పష్టం చేశారు. బ్లూటూత్స్ అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు.
స్టేడియం లోపల, వెలుపల పోలీసులను భారీగా మొహరిస్తున్నామని తరుణ్ జోషి తెలిపారు. మ్యాచ్ కోసం 2500 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొంటారని సీపీ వివరించారు. రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌కీ 3 గంటల ముందు నుంచి స్టేడియం లోపలికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. స్టేడియం వద్ద బ్లాక్ టికెట్స్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. షీ టీమ్స్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఉంటారన్నారు.
ఈ రూల్స్ ఐపీఎల్లో మాత్రమే సుమా- ఇంటర్నేషనల్ టీ20ల్లో వర్తించవు- కన్ఫ్యూజ్ అవకండి - Rules Used In IPL Not In T20s
TSRTC Sajjanar on IPL Match Buses : క్రికెట్ అభిమానులకు టీఎస్‌ఆర్టీసీ (TSRTC) శుభవార్త చెప్పింది. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో బుధవారం జరగబోయే ముంబయి ఇండియన్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ మ్యాచ్‌కు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అభిమానులకు ప్రయాణ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ మైదానానికి 60 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఇవి బుధవారం సాయంత్రం ఆరు గంటలకు నిర్దేశిత ప్రాంతాల్లో ప్రారంభమై, మ్యాచ్ అనంతరం తిరిగి రాత్రి 11.30గంటలకు స్టేడియం నుంచి బయల్దేరుతాయని తెలిపారు. ఈ ప్రత్యేక సౌకర్యాన్ని ఉపయోగించుకొని మ్యాచ్‌ను వీక్షించాలని క్రికెట్ అభిమానులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
సన్‌రైజర్స్ మ్యాచ్ - క్షణాల్లో మారిపోయిన కావ్య ఎక్స్ప్రెషన్స్ - Kavya Maran SRH
"హైదరాబాద్‌లో జరగబోయేముంబయి ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి ఐపీఎల్ మ్యాచ్‌కు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశాము. రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌కీ 3 గంటల ముందు నుంచి స్టేడియం లోపలికి అనుమతిస్తాము. స్టేడియంలోకి ఎటువంటి వస్తువులకు అనుమతి లేదు. స్టేడియం వద్ద బ్లాక్ టికెట్స్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాము. షీ టీమ్స్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఉంటారు". - తరుణ్ జోషి, రాచకొండ పోలీసు కమిషనర్
రూ.24 కోట్ల బౌలర్‌ను బెంబేలెత్తించిన సన్‌రైజర్స్! - IPL 2024