ETV Bharat / state

హిందూపురంలో బాలయ్య సందడి - ELECTRICITY SUBSTATION BHUMI PUJA

నియోజకవర్గంలో విద్యుత్ సమస్య లేకుండా చేస్తామని హామీ - తగినన్ని సబ్ స్టేషన్లను ఏర్పాటు

mla_balakrishna_in_bhumi_puja_for_the_electricity_substation_in_hindupur
mla_balakrishna_in_bhumi_puja_for_the_electricity_substation_in_hindupur (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 22, 2025, 3:45 PM IST

MLA Balakrishna in Bhumi Puja For The Electricity Substation in Hindupur : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటించారు. ఇందులో భాగంగా మూడోరోజు హిందూపురం రూరల్ గొల్లపురంగ్రామంలో రూ.3.48 కోట్లతో నిర్మించనున్న విద్యుత్ సబ్‌స్టేషన్‌కు ఆయన భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

హిందూపురం నియోజకవర్గంలో విద్యుత్ సమస్య లేకుండా తగినన్ని సబ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నివాస ప్రాంతాల ప్రజలతోపాటు రైతులు, పరిశ్రమలకు తగినంత విద్యుత్ సరఫరా చేయడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. హిందూపురం నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు.

Balakrishna Third Day Hindupur Constituency Visit : నియోజకవర్గంలో విద్యుత్ సమస్య లేకుండా ఆయా ప్రాంతాలలో సబ్​స్టేషన్​ నిర్మిస్తామన్నారు. ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు తీసుకొస్తోందని, వాటికి అనుగుణంగానే ఇళ్లకు, పరిశ్రమలకు రైతులకు సబ్సిడీలు అందుతాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హిందూపురం నియోజకవర్గం భవిష్యత్తులో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. హిందూపురం అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజ్ కింద సీఎం నారా చంద్రబాబు నాయుడు నిధులు మంజూరు చేయడానికి కృషి చేస్తున్నామన్నారు.

జీవితం చాలా విలువైనది - ద్విచక్రవాహనదారులు హెల్మెట్​ ధరించాలి: బాలకృష్ణ

రోడ్లు, తాగునీటి పైపులు మరమ్మతుల కోసం రూ. 126 కోట్లు మంజూరు చేశారన్నారు. ఇదేవిధంగా ఇంటింటికి తాగు నీటి కొళాయి కోసం 92కోట్లు నిధులు మంజూరు చేస్తామన్నారు. ఎత్తిపోతల పథకం కింద గోరంట్ల చిలమత్తూరు మండలాలకు రూ 850 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తామన్నారు. గత వైఎస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వం ఎత్తిపోతల పథకం గురించి ఏం మాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర రాజధాని అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే అభివృద్ధి కోసం వేలాది కోట్ల రూపాయలు మంజూరు చేయడంపై బాలకృష్ణ కృతజ్ఞతలు చెప్పారు. పట్టు రైతులు సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నారు వివరించారు.

నందమూరి తారక రామారావు వర్ధంతి - ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబసభ్యుల నివాళులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.